థంతేరస్: హైదరాబాద్లో ఈ టైమింగ్స్లోనే బంగారం కొనాలట.. ఈ ముహూర్తంలోనే లక్ష్మీ కటాక్షం అంట..!

థంతేరస్.. ధన త్రయోదశి.. దీపావళి ముందే రోజు వచ్చే వేడుక.. ఈ రోజున బంగారం కొంటే లక్ష్మీ కటాక్షం వరిస్తుందని.. ఏడాది అంతా శుభమే జరుగుతుందని.. లక్ష్మీదేవి మన ఇంట్లో బంగారం సిరులు కురిపిస్తుందనే విశ్వాసం.. నమ్మకం ఉన్నాయి.. 

ధన త్రయోదశి రోజున ఎప్పుడుపడితే అప్పుడు.. ఏ టైం పడితే ఆ టైంలో బంగారం కొనుగోలు చేయకూడదంట.. దీనికో సమయం ఉంది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇంతకీ థంతేరస్ రోజున.. ఏ సమయంలో.. ఏ ముహూర్తంలో బంగారం కొనుగోలు చేయాలి అనేది వివరంగా తెలుసుకుందాం..

త్రయోదశి తిథి అక్టోబర్ 29న ఉదయం 10:31 నిమిషాలకు మొదలై అక్టోబర్ 30 మధ్యాహ్నం 1:15కి ముగుస్తుంది. అందువల్ల.. ధన త్రయోదశి నాడు బంగారం కొనాలనుకునే వారు  సాయంత్ర సమయంలో కొనడం మంచిదనేది పంచాంగం తెలిసిన పండితుల మాట. దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో బంగారం కొనుగోలు చేయడం మేలని పండితులు చెబుతున్నారు.

పంచాంగం ప్రకారం.. ధన త్రయోదశి నాడు ఏ ప్రాంతంలోని వినియోగదారులు ఏ సమయంలో బంగారం కొనడం మంచిదంటే..

06:45 PM నుంచి 08:15 PM (హైదరాబాద్)
06:55 PM నుంచి 08:22 PM - (బెంగళూరు)
07:01 PM నుంచి 08:33 PM - (పుణె)
06:31 PM నుంచి 08:13 PM - (ఢిల్లీ)
06:44 PM నుంచి 08:11 PM - (చెన్నై)
06:40 PM నుంచి 08:20 PM - (జైపూర్)
06:32 PM నుంచి 08:14 PM - (గురుగ్రాం)
06:29 PM నుంచి 08:13 PM - (చండీగర్)
05:57 PM నుంచి 07:33 PM - (కోల్కత్తా)
07:04 PM నుంచి 08:37 PM - (ముంబై)
06:31 PM నుంచి 08:12 PM - (నోయిడా)
06:59 PM నుంచి 08:35 PM - (అహ్మదాబాద్)