Good Health : రాత్రులు నిద్ర పట్టటం లేదా.. వీటిని అలవాటు చేసుకోండి.. హ్యాపీగా నిద్రపోండి..!

రోజులు మారేకొద్దీ లైఫ్ స్టైల్లో ఎన్నో మార్పులొస్తున్నాయి. ఆహారం, వ్యాయామం, ఇల్లు, ఆఫీస్ ఇలా అన్ని చక్కగానే బ్యాలెన్స్ చేస్తున్నారు. కానీ అన్నింటికంటే ముఖ్యమైన నిద్రను మాత్రం నెగ్లెక్ట్ చేస్తున్నారు. బిజీ లైఫ్లో కంటినిండా నిద్ర పోవడం చాలా కష్టమైపోయింది. ఎంత ఎర్లీగా మంచం ఎక్కినా నిద్ర మాత్రం పట్టదు. అందుకే కొన్ని హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే... టెన్షన్స్ అన్ని పక్కనపెట్టి హాయిగా నిద్రపోవచ్చని చెప్తున్నాయి కొన్ని సర్వేలు.

శరీరానికి తగినంత శ్రమ మంచి తింది. పడి లేన్సిజీవితం ఉంటే చాలు.. పడుకున్న కొద్ది నిమిషాల్లోనే నిద్ర ముంచుకొస్తుంది. కానీ ఈ రోజుల్లో సగానికి సగం మంది ఏదో ఒకరకంగా మానసిక ఒత్తిడికి, ఆందోళనలకు లోనవుతున్నారు. వాళ్లందరూ ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్నారు. చాలామందికి రాత్రి పన్నెండు దాటితేగాని నిద్రపట్టదు. మళ్లీ ఉదయాన్నే ఆఫీసుకు పోవాలి. కాబట్టి.. ఆరింటికి నిద్రలేవాల్సిందే. అంటే వాళ్లు నిద్రపోయే సమయం ఆరు గంటలు మాత్రమే. కానీ మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి. సరైన నిద్ర లేకపోతే ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రశాంతమైన నిద్రకు సర్వేలు ఏం చెప్తున్నాయో చూద్దాం.

 తొంభై నిముషాల  ముందు

'యూనివర్సిటీ అఫ్ టెక్సాస్' కు చెందిన పరిశోధకులు నిద్రకు తొంభై నిముషాల ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మంచి నిద్ర సొంతమవుతుందని చెప్తున్నారు. పొద్దున స్నానం చేయకపోయినా పర్వాలేదు కానీ రాత్రి పడుకునే ముందు మాత్రం ఖచ్చితంగా స్నానం చేయాలంటున్నారు. ఎందుకంటే.. పొద్దున్నే స్నానం చేసి పని మీద బయటకు వెళ్తే.. మళ్లీ చీకటి పడ్డాకే ఇంటికి రావడం, వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు..దారిలో ఎన్నో రకాల బ్యాక్టీరియా మన శరీరం పైకి చేరుతుంది. వీటికి తోడు రోజంతా పని చేసిన అలసట, వర్క్ టెన్షన్లు, వీటితో ఇంటికి రాగానే ఊరికే తినేసి పడుకుంటారు చాలామంది. పోనీ పడుకున్నాక నిద్రపడుతుందా అంటే అదీ లేదు.. అందుకే సిటీ లైఫ్ లి అలవాటైన వాళ్లు రాత్రిపూట కూడా స్నానం చేయడం ఎంతో అవసరం. రాత్రివేళ చేసే స్నానం శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. అదికూడా సరిగ్గా నిద్రకు తొంభై నిముషాల ముందు స్నానం చేస్తే శరీరంలో ఉష్ణోగ్రతలు బ్యాలెన్స్ ఉంటాయట. దాంతో సుఖమైన నిద్ర సొంతమవుతుంది. రోజంతా పనిచేసి అలసిపోయిన కండరాలకు స్నానంతో రిలాక్సేషన్ దొరుకుతుంది. ఎంతో హాయిగా అనిపిస్తుంది. స్నానం వల్ల ఊపిరితిత్తుల్లో ఉండిపోయిన ఇరిటెంట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. దాంతో పడుకునేటప్పుడు శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉండవు. శ్వాస ఎంత ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. స్నానం చేయకుండా ఉంటే రాత్రివేళ వచ్చే చల్లగాలిని కూడా సరిగాఆస్వాదించలేరు. అలాగే స్నానం చేయకుండా పడుకుంటే.. ఒంటికి ఉన్న మురికి అంతా బెడ్ కి అంటుకుపోతుంది. రోజూ అదే బ్యాక్టీరియా మధ్యలో పడుకోవాల్సి వస్తుంది. దాంతో ఎన్నోరకాల ఇన్ ఫెక్షన్స్ వస్తాయి. అందుకే తలనొప్పి, అలసట, ఒత్తిడి .. ఇవన్నీ పోవాలంటే రాత్రిపూట స్నానం చేయడం మరచిపోకూడదు.

రాత్రిళ్లు కూడా వాడితే.....

ఇక పోతే చాలామంది స్నానం తర్వాత బాడీకి మంచి డియోడరెంట్ కొట్టందే బయటకు వెళ్లరు. అయితే అదే డియోడరెంటీని రాత్రి నిద్రపోయే ముందు కూడా వాడితే బెటరంటున్నారు పరిశోధకులు. బాడీ స్ప్రేను పగలు అప్లై చేయడం వల్ల స్వేద రంధ్రాలు మూసుకుపోయి, శరీరానికి ఇబ్బంది కలిగిస్తాయి. అదే ఈ డియోలను పడుకోవడానికి ముందు వాడితే స్వేదరంధ్రాలకు ఎటువంటి ఇబ్బందిఉండదు. అలాగే ఒక మంచి డియోడరెంట్ సుమారు 24నుంచి 48 గంటలదాకా పనిచేస్తుంది. రాత్రి స్నానం చేసిన తర్వాతశరీరం పొడిగా, ఫ్రెష్ గా ఉండేలా డియోడరెంట్ హెల్ప్ చేస్తుంది.ఇక ఇవి కాకుండా సరైన నిద్రకోసం మరికొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి అవేంటంటే....

• నిద్రపోవడానికి, లేవడానికి కచ్చితంగా ఒక టైం కేటాయించాలి. ప్రతీ రోజూ ఆ టైం టేబుల్ ప్రకారమే ఫాలో కావాలి. ఫలనా టైము నిద్రపోవాలని స్ట్రిక్ట్ రూల్ పెట్టుకుంటే.. దాని ప్రకారం శరీరం ట్యూన్ అవుతుంది. 
• నిద్రకు.. చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ కూడాముఖ్యమే... అందుకే బెడ్ రూమ్ ను ఎప్పటికప్పుడు క్లీన్ ఉంచుకోవాలి. దాంతోపాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, టివీ, ల్యాప్ టాప్, వంటి వాటిని పడకగదిలో లేకుండా చేయడం వలన నిద్రకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు.( పడుకునే ముందు జంక్ పదార్థాలు తినకూడదు. జండ్ ఫుడ్స్ గురకను, షుగర్ స్థాయిని పెంచుతాయి. ఇది నిద్రను డిస్టర్బ్ చేస్తుంది. వీలైనంత వరకు రాత్రి భోజనంలో పప్పుధాన్యాలతో కూడినవి తీసుకోవడం మంచిది. అలాగే పడుకోవడానికి రెండు గంటల ముందే తినేయడం మరీ మంచిది.
• సాయంత్రం వేళల్లో కాస్త వ్యాయామం చేసి ఒళ్ళు వంచగలిగితే శరీరం అలసినట్టవుతుంది. దాంతోరాత్రిళ్లు నిద్ర చక్కగా వస్తుంది. మంచి నిద్ర కోసం కాఫీకి దూరంగా ఉండాలి. అందులో ఉండే కెఫిన్ నిద్ర వ్యవస్థను దెబ్బ తీస్తుంది. 

నిద్రను చెదరగొట్టే మొబైల్

యుఎస్కి చెందిన మరోపరిశోధన సంస్థ నిద్రకు ముందు మొబైల్ వాడొద్దని చెస్తోంది. నిద్రకు మొబైల్ స్క్రీన్ బద్ద శత్రువట. నిద్రపోయే ముందునైట్ ఇంట్లో లైట్లన్నీ ఆఫ్ చేసి, మొబైల్ స్క్రీన్ కు అతుక్కుపోవడం అలవాటు చాలామందికి. ఈ అలవాటే చాలా నష్టం తెచ్చి పెడుతుంది. మొబైల్ నుండి వెలువడే బ్లూ లైట్ వల్ల కంటికి ఎంతో నష్టం, చీకట్లో మొబైల్ చూడడం వల్ల ఆ వెలుతురు. ప్రభావం పడి శరీరంలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఈ హార్మోన్ సాయంత్రం నుంచి శరీరంలో మెల్ల మెల్లగా విడుదల అవుతుంది. అయితే రాత్రి పూట స్మార్ట్ ఫోన్ని ఉపయోగిస్తుంటే దాని నుండి వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ హార్మోన్ప ప్రభావం చూపుతుంది. దాంతో మెలటోనిన్ విడుదల తగ్గుతుంది. మెలటోనిన్ హార్మోన్ లేకపోతే నిద్రలేమి సమస్యలు వస్తాయి. అందుకే నిద్ర పోయే గంట ముందు స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్ దూరంగా ఉంచడం ద్వారా కంటికి, మెదడుకు విశ్రాంతి ఇచ్చి నట్టవుతుందని వైద్యులు సూచిస్తున్నారు.