ఇంట్లో డెకరేషన్ కోసం పెంచుకునే మొక్కల్లో మనీ ప్లాంట్ ఒకటి. దీన్ని పెంచుకోవటం చాలా ఈజీ కాబట్టి చాలా మంది ఇళ్లల్లో మనీ ప్లాంట్ పెంచుకుంటూ ఉంటారు. హాల్, బాల్కనీ, కిచెన్ ఇలా ఒక్కొక్కరు ఒక్కో చోట మనీ ప్లాంట్ ను పెంచుతూ ఉంటారు. అయితే, వాస్తు ప్రకారంగా మనీ ప్లాంట్ ఎక్కడ ఉండాలి, ఏ దిక్కులో ఉంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
కిచెన్ లో ఏ దిక్కులో పెంచాలి:
మనీ ప్లాంట్ ని ఏ రూమ్ లో అయినా పెంచుకోవచ్చు. దీనికంటూ ప్రత్యేక వాస్తు అంటూ ఏమి లేదు. ఒక కిచెన్లో మనీ ప్లాంట్ పెంచుకోవాలంటే ఆగ్నేయంలో పెంచుకోవడం మంచిది. ఈ దిక్కుకు అధిపతి వినాయకుడు కాబట్టి ఆగ్నేయంలో మనీ ప్లాంట్ పెంచుకుంటే కలిసొస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
కిచెన్ లో మనీ ప్లాంట్ ప్రాముఖ్యత:
కిచెన్ ఇంటికి ఫుడ్ ఫ్యాక్టరీ లాంటిది కాబట్టి మనీ ప్లాంట్ ని కిచెన్ లో పెట్టడం బెస్ట్ ఛాయిస్ అని చెప్పాలి. అయితే కిచెన్ లో నిప్పు ఉంటుంది కాబట్టి మనీ ప్లాంట్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. స్టవ్ కి కనీసం 4 నుండి 5 అడుగుల దూరంలో దీన్ని ఉంచితే మంచిది.
మనీ ప్లాంట్ ఎక్కడ పెరుగుతుంది:
మనీ ప్లాంట్ మట్టిలో నీటిలో ఎక్కడైనా పెరుగుతుంది. అయితే, మట్టిలో పెట్టిన దానిని నీటిలోకి, నీటిలో పెట్టిన దానిని మట్టిలోకి మార్చకూడదు. నీటిలో పెంచుకునేట్లు అయితే వారానికి రెండు, మూడు సార్లు నీటిని మార్చితే సరిపోతుంది. ఒకవేళ మట్టిలో పెంచితే మనీ ప్లాంట్ కి నీటిలో కలిపినా ఆవు పేడను మట్టిలో కలపాలి.