మీ బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్లను కొనుక్కోవాలనుకుంటున్నారా..? మీ బడ్జెట్లో కొనుగోలు చేసేందుకు అనేక ఆప్షన్లు ఉన్నప్పటికీ వాటి మీరు కోరుకున్న స్మార్ట్ ఫోన్ ఎంచు కోవడం అంటే కత్తిమీద సామే..అయితే మీకు నచ్చిన, మీరు మెచ్చిన స్పెసిఫికేషన్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు ఇయర్ ఎండ్ సేల్ లో భాగంగా తక్కువ ధరలకు లభిస్తు న్నాయి.. రూ.15వేల లోపు బడ్జెట్ లో దొరికే 8 స్మార్ట్ ఫోన్ల లిస్టు మీకోసం..
Poco X6 నియో:
Poco X6 Neo స్మార్ట్ ఫోన్.. ఇయర్ ఎండ్ సేల్ లో భాగంగా రూ. 15వేల లోపు ధరలో లభిస్తుంది.. ఈ స్మార్ట్ ఫోన్ 1080 x 2400 పిక్సెల్స్ రెజల్యూషన్ ..120Hz రిఫ్రెష్ రేట్, 1,000 nits బ్రైట్ నెస్, 6.67-అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ డివైజ్ లో 2160Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్ , కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంది.
Poco మిడ్-రేంజర్ MediaTek Dimensity 6080 చిప్‌సెట్ కలిగి ఉంటుంది. అన్ని గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం Mali G57 MC2 GPUతో లభిస్తోంది. ఈ డివైజ్ LPDDR4X RAM, 8GB స్టోరేజ్ తో లభిస్తుంది. ఇది 128GB స్టోరేజ్ లో కూడా లభిస్తుంది. PocoX6 Neo స్టోరేజీని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు పెంచు కోవచ్చు.
ఈ స్మార్ ఫోన్లో 108 MP ప్రైమరీ కెమెరా సెన్సార్, 2 MP డెప్త్ డ్యుయెల్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ ఉంటుంది.. బెస్ట్ క్వాలిటీ సెల్ఫీలను తీసుకోవచ్చు.
Realme Narzo 70 Turbo:
Realme Narzo 70 Turbo స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో రూ.16వేల 998 ధరతో లభిస్తుంది. అయితే ఇయర్ ఎండ్ సేల్ లో భాగంగా వెయ్యి రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ తో కేవలం 15వేలక కొనుగోలు చేయొచ్చు.
ఈ డివైజ్ లో 120Hz రిఫ్రెష్ రేటు, 6.67 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్ ఫ్లే స్క్రీన్, 2వేల నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ MediaTek డైమెన్సిటీ 7300 ప్రాసెసర్,Mali G615 MC2 GPUతోపనిచేస్తుంది.
ALSO READ : ఫోన్ ఎక్కువగా వాడడంతోనే తల్లిదండ్రులతో గొడవలు
కెమెరా విషయానికి వస్తే.. 50MP ప్రైమరీ సెన్సార్, 2 MP పొర్ట్రెయిట్ లెన్స్ తో బ్యాక్ సైడ్ డ్యుయెల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా అయితే 16 MP సెల్ఫీ షూటర్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 5000mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్టు చేస్తుంది.
Vivo T3x స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ..
Vivo T3x స్మార్ట్ ఫోన్.. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఇది FuntouchOS 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌పై రన్ అవుతుంది. ఈ డివైజ్ లో ఛార్జింగ్ ఆప్షన్ బాగుంటుంది. 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో బలమైన 6000mAh బ్యాటరీ ఈ స్మార్ట్ ఫోన్ లో ఉంటుంది. ఇక స్టోరేజ్, RAM విషయానికొస్తే..128GB వరకు స్టోరేజ్ ఉంటుంది.. అదనంగా మైక్రోSD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజ్ని పెంచుకోవచ్చు.
ఇక డిస్ ప్లే విషయంలో కూడా ఈ స్మార్ట్ ఫోన్ బెస్ట్ వన్..120 Hz రీఫ్రెష్ రేట్, 6.72 అంగుళాల ఫుల్ HD+LCD డిస్ ప్లే ఉటుంది. 1000 nits హై బ్రైట్ నెస్ తో లభిస్తుంది.
Samsung Galaxy F15 5G:
Samsung Galaxy F15 5G స్మార్ట్ ఫోన్ లో 6.5-అంగుళాల పూర్తి HD+ sAMOLED డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. MediaTek డైమె న్సిటీ 6100+ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6GB వరకు RAM,128GB వరకు స్టోరేజ్ కు సపోర్టు చేస్తుంది. Galaxy F15 5G మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్ పెంచు కోవచ్చు.