ఏదైనా అకేషన్ వచ్చినా... పండుగలకు.. వేడుకలకు.. మన ఇంటికి ఎవరినైనా ఆహ్వానించినా... మనము ఎవరిఇంటికి వెళ్లినా.. గిఫ్ట్స్ తీసుకెళ్లడం ఆనవాయితి. కొద్ది రోజుల్లో 2023 సంవత్సరానికి బైబై చెప్పి .... 2024 వ సంవత్సరానికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పబోతున్నారు. అ సమయంలో ఆత్మీయులకు.. బంధువులకు.. స్నేహితులకు... బహుమతులు ఇచ్చి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతుంటారు.
కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కొత్త సంవత్సరం రోజు చాలా మంది బంధువులకు, స్నేహితులకు రకరకాల బహుమతులు ఇస్తారు. మనం కొనే బహుమతి ఇతరులకు నచ్చి ఉపయోగపడేలా ఉంటే మంచిది. ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ ఏ బహుమతి ఇవ్వాలో మీకు కన్ఫ్యూజన్ ఉంటే.. కొత్త సంవత్సరం బహుమతి ఐడియాలు మీకోసం. . .
కొత్త సంవత్సరం రోజు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. 2024 ఏడాది కొత్త సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు స్నేహితులు లేదా బంధువులకు కొన్ని ప్రత్యేక బహుమతులు ఇవ్వండి.
-
మీ స్నేహితుడు లేదా బంధువు మేకప్‌ని ఎక్కువగా ఇష్టపడితే వారికి ఇది గొప్ప బహుమతి కచ్చితంగా అవుతుంది. మార్కెట్లో అనేక బ్రాండ్‌లు కొత్త సంవత్సరం సందర్భంగా అత్యుత్తమ ఉత్పత్తులను తీసుకువచ్చాయి. కొత్త సంవత్సరం రోజు అది ఉత్తమ బహుమతి అవుతుంది. మీరు వీటిని మీ బడ్జెట్‌లో కొనుగోలు చేయవచ్చు. మీ ప్రియమైన వారికి ఈ బహుమతిని ఇవ్వవచ్చు.
-
కొవ్వొత్తులు ఇంట్లో ఎక్కువగా ఉండే వారికి బెస్ట్ గిఫ్ట్. ఈ కొవ్వొత్తులు లావెండర్, మోగ్రా, గులాబీ, వనిల్లా, చాక్లెట్ వంటి విభిన్న సువాసనలలో దొరుకుతాయి. ఇది ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది. ఈ బహుమతి ఎవరికైనా నచ్చుతుంది.
-
స్వీట్లు లేకుండా ఏ పండుగ పూర్తి కాదు. అది అందరికీ తెలిసిందే. కొత్త సంవత్సరం సందర్భంగా మీ బంధువులు, స్నేహితులకు చాక్లెట్ బాక్స్ బహుమతిగా ఇవ్వండి. ఇది వారికొత్త సంవత్సరం వేడుకల ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.
-
మీ ప్రియమైన వారికి మీకు ఇష్టమైన పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వవచ్చు. ఇది వారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. పుస్తకాలు చదవడం అనేది మంచి అలవాటు. ఏ టాపిక్ బాగుందో ఓ నోట్ రాసి కూడా అదే పుస్తకంలో పెడితే మరీ మంచిది.
-
కొత్త సంవత్సరంలో ఎవరికైనా బహుమతిని ప్లాన్ చేసేటప్పుడు స్మార్ట్ స్పీకర్ కూడా మంచి ఛాయిస్. ఈ పరికరాలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, రిమైండర్‌లను సెట్ చేయడం, ఇతర స్మార్ట్ హోమ్ పరికరాలను నియంత్రించడం చేస్తాయి. మీ పనులను సులభతరం చేయగలవు.
-
స్మార్ట్‌వాచ్‌లు జీవితంలో ఫిట్ నెస్ గుర్తు చేసే పరికరాలుగా మారిపోయి. ఇది ప్రతీ ఒక్కరి చేతికి ఈ కాలంలో ఉంటుంది. ఫిట్‌నెస్ ట్రాకింగ్, హృదయ స్పందన చూడటం, నోటిఫికేషన్‌లు వంటి ఫీచర్‌లతో స్మార్ట్‌వాచ్ అందుబాటులో ఉన్నాయి. ఇది కూడా మీరు కొత్త సంవత్సరం రోజున గిఫ్ట్ ఇచ్చేందుకు బాగుంటుంది.
-
మార్కెట్లో కొన్ని రకాల దిండ్లు, ఎల్ఈడీ లైట్లు, టీ కప్పులు దొరుకుతున్నాయి. వాటి మీద మీ ప్రియమైన వారి ఫొటోలను ప్రింట్ చేసి ఇవ్వొచ్చు. రెండు మూడు గంటల సమయంలోనే వస్తువును మీకోసం రెడీ చేసి ఉంచుతారు. కావాలనుకంటే ఏదైనా సందేశాన్ని రాసి కూడా బహుమతిగా ఇవ్వొచ్చు. దీనిని కచ్చితంగా అందరూ ఇష్టపడతారు