శరీరంలో రక్తం పెరగాలంటే ఈ టిప్స్ పాటించండి

ఎక్కువగా మహిళలు రక్తహీనతతో బాధపడుతుంటారు. సరైన సమయా నికి ఆహారాన్ని తీసుకోకపోవడం, పౌష్టికాహార లోపమే అందుకు  ప్రధాన కారణం. రోజూ మనకు లభ్యమయ్యే కూరగాయలను, ఆకు కూరలను క్రమం తప్ప కుండా సమయానికి తీసుకుంటే శరీరంలో రక్త శాతం తప్పక పెరుగుతుంది. దీనికి చిరుధాన్యాలు ఎంతో సహకరిస్తాయి.

ఏమేం తీసుకోవాలి..

అరికెలు రెండు రోజులు, సామలు రెండు రోజులు, మిగతా ధాన్యాలు మూడు రకాలు ఒక్కొక్క రోజు తీసు కోవాలి. అరికెలు మాత్రం వండుకునే ముందు కనీసం నాలుగు గంటలు నానబెట్టాలి..

Also Read :- పొదుపు చేయాలనుకువారికి.. బెస్ట్ సేవింగ్స్కి చిట్కాలు ఇవిగో

వీటిని ఆహారంగా తీసుకుంటూ క్యారెట్ ముక్కలు 25 గ్రాములు, బీట్రూట్ ముక్కలు 25 గ్రాములు, జామపండు/ఉసిరి ముక్కలు 05 గ్రాములు.. వీటిని మిక్సీలో వేసి రసం తీసి దానికి 200 మిల్లీలీటర్ నీటిని కలిపి తాగాలి. సాయంత్రం కరివేపాకు మజ్జిగ తాగాలి. కరివేపాకు ఆకులు 20 దంచి, మిక్సీలో వేసి, గ్లాసుడు మజ్జిగలో కలిపి 20 నిమిషాల తర్వాత తాగాలి.

రాత్రి భోజనానికి గంట ముందు తాగితే మంచిది. ఇలా చేస్తే నెలరోజుల్లో రక్తం పెరుగుతుందని ఆయుర్వేద డాక్టర్లు అంటున్నారు.