శరీరం ఆరోగ్యంగా ఉండడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. శరీరానికి కావాల్సిన పోషకాహారాలన్నీ అందిస్తాం. కానీ శరీరంతో పాటు మెదడు కూడా ఆరోగ్యంగా, యాక్టివ్ గా ఉన్నప్పుడే నిజమైన ఆరోగ్యం. అందుకే శరీరంతో పాటు మెదడుకు కూడా ఆహారాన్ని ఇవ్వాలి.
ఇంతకీ మెదడుకు ఆహారం ఏంటి అనేగా మీ డౌట్. స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడమే మెదడుకు ఆహారం. మెదడు బరువు మనిషి బరువులో మూడుశాతం ఉంటుంది. మూడు శాతం ఉండే మెదడు మనిషి పీల్చుకున్న గాలిలో 20 శాతానికి పైగా వాడుకుంటుంది. మెదడు చురుగ్గా పని చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటుంది.
పజిల్స్ పూరించడం, చదవడం, ఏకాగ్రతతో పనిచేయడం లాంటివి చేసేటప్పుడు సాధారణంగా పీల్చే గాలి కంటే ఎక్కువ గాలి కావాలి. మెదడు పనిచేసేటప్పుడు తగినంత ఆక్సిజన్ అందకపోతే... ఏకాగ్రత లోపిస్తుంది. చదివింది గుర్తుండదు. మానసిక సమతుల్యత కూడా లోపిస్తుంది. గాలి పరిశుభ్రంగా ఉండకపోతే ఎలర్జీలు కూడా వచ్చే ప్రమాదముంది. అందుకే రోజూ గంటసేపు స్వచ్ఛమైన గాలి ఉన్న ప్రదేశాల్లో గడపాలి..