Good Health : బ్యాక్ పెయిన్ వేధిస్తుందా.. అయితే మీకు బెస్ట్ ఎక్సర్ సైజ్ టిప్స్ ఇవే.. !

రోజుల తరబడి వెన్ను నొప్పి ఉందా?..మెడ పట్టేయడం,కదులుతున్నపుడు వచ్చే తీవ్రమైన నొప్పి వస్తుందా? అయితే జాగ్రత్త.. ఇవి మీ వెన్నెముక ప్రమాదంలో ఉందని చెప్పే సంకేతాలు. ఆరోగ్యంగా ఉన్న వెన్నెముక మన శరీరానికి సపోర్టివ్ గా ఉంటుంది. మీ నాడీ వ్యవస్థను రక్షిస్తుంది. అయితే వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మన శరీరానికి నిర్మాణాత్మక సపోర్టు ఇస్తుంది కాబట్టి. కదలడానికి, ఈజీగా మూవ్ కావడానికి సహకరించడమేకాదు.. శరీరానికి, మెదడుకు మధ్య సమాచారం ప్రసారం చేసే నాడీ వ్యవస్థ  వెన్నుపామును రక్షిస్తుంది. 

మీ వెన్నుముక ఆరోగ్యం మీపైనే ఆధారపడి ఉంటుంది. వెన్నుముక రక్షించుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక నొప్పి, కదలికలపై ప్రభావానికి దారితీస్తుంది. నరాలు దెబ్బతినే అవకాశాలు న్నాయని సీకే బిర్లా హాస్పిటల్ గురుగ్రామ్ లోని స్పైనల్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ భానోట్ చెబుతున్నారు. వెన్నెముక ఆరోగ్యం దెబ్బతినే వరకు నిర్లక్ష్యం చేయొద్దు.. రెగ్యులర్ వ్యాయామం, సరైన భంగిమ, మంచి అలవాట్లతో వెన్నుముక సంబంధిత సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు. కొన్ని మార్గాలు చెప్పారు అవేంటో చూద్దాం. 

వెన్నునొప్పిని తగ్గించేందుకు బెస్ట్ ఎక్సర్సైజులు..

భంగిమ(maintains posture): 

సాధారణంగా మనం వ్యాయామం చేసేటప్పుడు, కూర్చున్నప్పుడు ఇష్టానుసారంగా చేస్తుంటాం.. మనం చేసే వ్యాయామం, కూర్చునే భంగిమలపైనే మన వెన్నెముక ఆరోగ్యం ఆధారపడి ఉందంటున్నారు డాక్టర్లు. పైలేట్స్, యోగా అనే రెండు వ్యాయామాలు ఆరోగ్యకరమైన అలవాట్లు ఏర్పరుచుకునేందుకు, మీ భంగిమపై అవగాహన పెంచేందుకు సహాయపడతాయంటున్నారు. 

కాళ్లు, భుజాలు, వీపు లక్ష్యంగా వ్యాయామం..

మనం రోజూ చేసే వ్యాయామంలో ముఖ్యంగా బరువులు ఎత్తే వ్యాయామం, రెసిస్టెన్స్ బ్యాండ్ లతో పనిచేయడం ద్వారా వెన్నెముక బలోపేతం చేయొచ్చుంటున్నారు. కాళ్లు, భుజాలు, వీపు లక్ష్యంగా ఎక్సర్ సైజులు చేయాలి.. ఇలాంటి సమయంలో గాయాలు కాకుండా ఉండేందుకు, ఎక్కువ బలం పెంచడానికి ఎల్లప్పుడు సరైన షేప్ ను ఎంచుకోవాలంటున్నారు. 

కోర్ కండరాలను బిల్డప్ చేయాలి 

వెన్నెముక ఆరోగ్యంగా ఉండాలంటే దాని వెంట ఉండే కోర్ కండరాలు బలంగా ఉండాలి.. వీటిలో కొన్ని వెనకభాగంలో, ముందు కడుపు భాగంలో ఉంటాయి. ఈ కండరాలను బలోపేతం చేసేందుకు పలకలు, బ్రిడ్జెస్, క్రంచెస్ వ్యాయామాలు చేయాలి. బలమైన కోర్ కండరాలు, బెస్ట్ భంగిమకు సహాయపడుతుంది. వెన్నెముకపై ఒత్తిడిని తగ్గిస్తుంది. 

తక్కువ ప్రభావం గల వ్యాయామాలు: నడక, ఈత, సైక్లింగ్ వంటి తక్కువ ప్రభావం చూపే ఏరోబిక్ వ్యాయామాలు వెన్నుముక ఆరోగ్యానికి అద్భుతమైనవి. ఈ వ్యాయామాలు వెన్నెముక చుట్టుపక్కల కండరాలకు రక్త ప్రసరణను పెంచుతాయి. రికవరీని ప్రోత్సహిస్తాయి.వారానికి కనీసం 150 నిమిషాల మితమైన ఏరోబిక్ వ్యాయామం మీ వెన్నుముకను ఆరోగ్యంగా ఉంచి బ్యాక్ పెయిన్ ను నివారిస్తుంది. 

బ్యాలెన్సింగ్ కోసం ట్రైనింగ్: తాయ్ చీ, సాధారణ బ్యాలెన్సింగ్ భంగిమలు మీ వెన్నెముక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి వ్యాయామం చేసేటప్పుడు వెన్నెముక గాయపడకుండా నివారిస్తుంది. మీ రోజువారి వ్యాయామంలో బ్యాలెన్స్ శిక్షణను చేర్చడం ద్వారా మొత్తం వెన్నెముక ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తుంది.. 

ఎక్కువ సమయం కూర్చోవద్దు: 

ఇది వ్యాయామం కాదు కానీ వెన్నెముక ఆరోగ్యం ఉండాలంటే ఎక్కువ సమయం కూర్చోకుండా ఉండాలి. ఎక్కువ సమయం కూర్చుంటే వెన్నెముక కు ఇబ్బంది, కండరాల బిగుసుకుపోతాయి. వెన్నుముకను ఆరోగ్యంగా ఫ్లెక్సిబుల్ ఉంచాలంటే ప్రతి 30 నుంచి 50 నిమిషాలకు ఒకసారి నిలబడటం గానీ, ఒళ్లు విరుపు అంటారు అలా శరీరాన్ని సాగదీయడం గానీ చేయాలంటున్నారు డాక్టర్లు.


వెన్నెముకకు సంబంధించిన వ్యాయాన్ని మొదలు పెట్టే ముందు నిపుణుల సూచనలు పాటించడం చాలా ముఖ్యం. వెన్నుముక సమస్యలు ఉన్నట్లయితే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ లేదా ఫిట్ నెస్ ట్రైనర్ ను సంప్రదించాలి. ఇది ఎక్సర్ సైజ్ చేసే సమయంలో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్యాక్ పెయిన్ కు చెక్ పెట్టొచ్చు.