క్రిస్మస్ వచ్చిందంటే కానుకల తాతయ్య శాంటా సందడి మొదలవుతుంది. చాలామంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్క సర్ ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తుంటారు. అయితే, ఈసారి కూడా కరోనా భయంతో అందరూ ఒక దగ్గర కలిసే వీలులేదు. మరి ఇష్టమైన వాళ్లకి గిఫ్ట్ ఎలా ఇవ్వాలి? ఆ ఆలోచనే అక్కర్లేదు. ఎందుకంటే గిఫ్ట్స్ ఇచ్చేందుకు స్పెషల్గా మొబైల్ యాప్స్ వచ్చేశాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే చాలు. ఆ యాప్స్ ఏంటి? ఏగిఫ్ట్స్ ఇస్తే బాగుంటుంది అనే వివరాలివి...
స్పెషల్ క్రిస్మస్ కి ఏం గిఫ్ట్ ఇవ్వాలి? ఎంత ధరలో ఉండాలి? అవతలివాళ్లకి ఏం అవసరమో ఆలోచించి ఒక లిస్ట్ తయారుచేసుకోవాలి. తర్వాత ఆయా అప్లికేషన్స్ లో గిఫ్ను ఎవరికి పంపించాలో వాళ్ల ఇ-మెయిల్, అడ్రస్, ఏ రోజు డెలివరీ చేయాలి? వంటి వివరాలు ఇవ్వాలి. సీక్రెట్ శాంటాలు వాళ్లకి గిఫ్ట్స్ ఇచ్చేస్తారు. 'ఎల్ఫ్ స్టెర్, గిఫ్ స్టెర్, స్నీకీ శాంటా, డ్రా నేమ్స్, సీక్రెట్ శాంటా నేమ్ పికర్, సీక్రెట్ శాంటాస్ హెల్పర్ ' వంటి యాప్స్ ఈ సర్వీసులు ఇస్తున్నాయి.
ఇవి ఇవ్వొచ్చు
చలికాలంలో పాదాల్ని వెచ్చగా ఉంచే సాక్సుల్ని ఇవ్వొచ్చు. వాటిలో కూడా క్రిస్మస్ థీమ్ తో ఉన్నవి అయితే బాగుంటాయి. హాట్ చాక్లెట్స్, కస్టమైజ్డ్ కాఫీ మగ్స్, ఇండోర్ ప్లాంట్స్ వంటివి కూడా ఇవ్వొచ్చు. ఈ సీజన్లో స్కిన్కరికి పనికొచ్చే ప్రొడక్ట్స్ ని గిఫ్టుగా ఇస్తే అవి వాడినప్పుడల్లా పంపినవాళ్లే గుర్తుకొస్తారు.
జూమ్ డేట్
అందాక ఒకరోజు వర్చువల్ మీటింగ్ డేట్ పెట్టుకోవాలి. ఆ టైమ్కి అందరూ జూమ్ క్లౌడ్ కాల్ లోకి రావాలి. వర్చువల్గానే ఫన్నీ గేమ్స్, యాక్టివిటీస్తో జాలీగా గడపాలి. చివర్లో అందర్నీ గిఫ్ట్ ఓపెన్ చేయమనాలి. ఆ గిఫ్ట్ పంపిన సీక్రెట్ శాంటా ఎవరో కనిపెట్టమనాలి.