Good Food : బరువు తగ్గించే మన టిఫిన్స్ ఇవే.. నిజంగా అద్భుతం అంట

మనలో ప్రతి ఒక్కరు బరువును కరెక్ట్ గా మెంటైన్ చేసి ఫిట్ గా హెల్తీగా ఉండాలని అనుకుంటూ ఉంటాం. ఫిట్ గా ఉండటం కోసం డైటింగ్ ఎంత ముఖ్యమో, శరీరానికి కావాల్సిన పోషకాలు సరిపడా మోతాదులో అందటం కూడా అంతే ముఖ్యం. డైటింగ్ చేసేటప్పుడు తీసుకునే ఫుడ్ ఆశించినంత టేస్టీగా ఉండటకపోవటం మాములే. అయితే, బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ ని తీసుకుంటే, రుచికి రుచి, డైట్ కి డైట్ అందుతుంది. బెస్ట్ సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం:

ఇడ్లి, సాంబార్:

ఇడ్లిలో మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభించటంతో పాటుగా ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి బరువు తగ్గటానికి హెల్ప్ అవుతుంది. ఇడ్లి పిండి లెంటిల్స్, రైస్ తో తయారవుతుంది కాబట్టి లైట్ గా ఉంటుంది. సాంబార్ ఇడ్లికి టెస్ట్ యాడ్ చేయటమే కాకుండా మనకి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తుంది.

దోశ

దోశ పిండి కూడా ఇడ్లి పిండి లాగే ఉంటుంది, కాకపోతే దోస పిండి కొంచెం మందంగా ఉంటుంది. దోశలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. దోశను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుంది కాబట్టి బరువు తగ్గటంలో తోడ్పడుతుంది.

ఉప్మా:

గోధుమ రవ్వలో ఉండే బెనిఫిట్స్ ఉప్మా ద్వారా అందుతాయి. ఉప్మాలో నెయ్యి, ఉల్లిపాయ, శనగపప్పు, అల్లం, పసుపు వంటి ఇతర స్పైసెస్ మాత్రమే కాకుండా కూరగాయలు కూడా వాడతారు కాబట్టి ఉప్మా ద్వారా సంపూర్ణ పోషణ అందుతుంది.

ఊతప్పం:

ఊతప్పం కూడా ఇడ్లి, దోశ లాంటి పిండితోనే చేస్తారు కాబట్టి ఇది కూడా బరువు తగ్గటం కోసం తోడ్పడుతుంది. ఊతప్పం ను మిల్లెట్స్ తో కూడా చేసుకునే వీలు ఉంది కాబట్టి ఇది బరువు తగ్గటం కోసం తోడ్పడుతుంది. ఇవే కాకుండా మన ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ అన్ని వెయిట్ మేనేజ్మెంట్ కి హెల్ప్ అవుతాయని చెప్పచ్చు.