* భారతదేశంలో సంస్థానాల సంఖ్య 562.
* భారతదేశంలో విలీనం కాకుండా ఉన్న సంస్థానాలు ట్రావెన్కోర్, జమ్మూకశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్.
* ఆపరేషన్ పోలోకు ఉన్న ఇతర పేర్లు గొండార్ట్ ప్లాన్, పోలీస్ చర్య, ఆపరేషన్ క్యాటర్ పిల్లర్.
* షేక్ బందగి సొంత గ్రామం కామారెడ్డిగూడెం, జనగామ తాలూకా.
* తెలంగాణ సాయుధ పోరాటానికి కారణమైన గడీ విస్నూరు గడీ.
* దొడ్డి కొమురయ్య హత్య 1946, జులై 4న జరిగింది.
* దొడ్డి కొమురయ్య సొంత గ్రామం కడివెండి, జనగామ తాలూకా.
* తెలంగాణ సాయుధ పోరాటం ముగిసిన తేదీ 1951, అక్టోబర్ 21.
* మా భూమి నాటకం రాసింది సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు.
* సింగ్ జంగ్ చర్చలు మందముల నర్సింగరావు, బహదూర్ యార్జంగ్ మధ్య జరిగాయి.
* రయ్యత్ పత్రికను మందముల నర్సింగరావు స్థాపించాడు.
* 50 సంవత్సరాల హైదరాబాద్ చరిత్ర రచయిత మందముల నర్సింగరావు.
* బైరాన్‌పల్లి సంఘటన 1948, ఆగస్టు 27న జరిగింది.
* జాయిన్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన తేదీ 1947, ఆగస్టు 7.
* యథాతథ ఒప్పందం 1947, నవంబర్ 29న జరిగింది.
* హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ 1938, జులై 29న ప్రారంభమైంది.
* హెచ్ఎస్సీపై 1938, అక్టోబర్ 7న నిజాం ప్రభుత్వం నిషేధం విధించింది.
* హెచ్ఎస్సీపై1946, జులై 1న నిషేధం తొలగించారు.
* షోయాబుల్లఖాన్ తేజ్, రయ్యత్, ఇమ్రోజ్ పత్రికల్లో పనిచేశారు.
* యథాతథ ఒప్పందంలో పాల్గొన్న నిజాం ప్రధాన మంత్రి చటారీ నవాబ్.
* కేఎం మున్షీ రాసిన గ్రంథం ఎండ్ ఆఫ్ అన్ ఎరా.
* హైదరాబాద్ సంస్థానం చివరి ప్రధాన మంత్రి మీర్ లాయక్ అలీ.
* మీర్‌లాయక్ అలీ రాసిన గ్రంథం ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్.
* హైదరాబాద్ చివరి అధ్యక్షుడు ఎల్.ఎం.ఎడ్రూస్.
* నిజాంపై బాంబు దాడి చేసిన వ్యక్తి నారాయణ పవార్.
* నారాయణ పవార్ నిజాంపై 1947, డిసెంబర్ 4న దాడి చేశాడు.
* ఆపరేషన్ పోలోకు నాయకత్వం వహించిన వ్యక్తి కెప్టెన్ మహారాజా సింగ్ (దక్షిణ భారత కమాండర్)
* హైదరాబాద్ లేదా భాగ్యనగర్ రేడియోను ప్రారంభించింది పాగా పుల్లారెడ్డి.
* హైదరాబాద్ సంస్థానం అధికారిక రేడియో దక్కన్ రేడియో.
* 1948, సెప్టెంబర్ 17ను మహారాష్ట్రలో మరఠ్వాడ సంగ్రామ్ ముక్తి దివస్ పేరుతో జరుపుకుంటారు.
* ఆపరేషన్ పోలో సమయంలో భారత రక్షణ మంత్రి బల్దేవ్సింగ్.
* ఆపరేషన్ పోలో సమయంలో భారత సైనిక అధ్యక్షుడు జనరల్ బూచర్.
* ఆపరేషన్ పోలో సమయంలో మొదటిసారిగా ఆక్రమించిన పట్టణం నల్దుర్గ్.
* భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశాన్ని ఎ, బి, సి, డి రాష్ట్రాలుగా విభజించారు.
* ఆపరేషన్ పోలో అనంతరం హైదరాబాద్ సంస్థానం బి రాష్ట్ర హోదాలో విలీనమైంది.
* హైదరాబాద్ రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 16 (మహారాష్ట్ర 5, కర్ణాటక 3, తెలంగాణ 8).
* మహారాష్ట్ర ప్రాంతంలోని జిల్లాలు నాందేడ్, ఔరంగాబాద్, బీరార్, ఉస్మానాబాద్, ఫర్బణీ.
* హైదరాబాద్ రాష్ట్రంలోని కర్ణాటక జిల్లాలు బీదర్, రాయ్‌చూర్, గుల్బర్గా.
* హైదరాబాద్ సంస్థాన వైశాల్యం 18,698 చ.కి.మీ.
* హైదరాబాద్ సంస్థానం అధికారిక నాణెం హలిసిక్కా/ ఉస్మానియా సిక్కా.
* ఆపరేషన్ పోలో అనంతరం జేఎన్ చౌదరి ఆర్మీ ప్రభుత్వం 1948, సెప్టెంబర్ 18న అధికారంలోకి వచ్చింది.