- బెంగళూరులో శ్రద్ధావాకర్ తరహా ఘటన
బెంగళూర్: కర్నాటకలో శ్రద్ధావాకర్ తరహా దారుణం వెలుగుచూసింది. బెంగళూరులో వయాలికావల్ ఏరియాలో ఓ యువతి(29)ని చంపి, ఆమె డెడ్ బాడీని 32 ముక్కలుగా నరికారు. ఆ శరీర భాగాలను ఫ్రిజ్‌లోనే స్టోర్ చేశారు. అయితే, అమెను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనే విషయాలు ఇంకా వెల్లడికాలేదు. వయాలికావల్ లోని మున్నేశ్వర్ బ్లాక్ మొదటి అంతస్తులో 32 ముక్కలుగా నరికిన మహిళ మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్‌లో గుర్తించామని పోలీసులు వెల్లడించారు.
శరీర భాగాలు నాలుగైదు రోజులుగా ఫ్రిజ్‌లోనే ఉన్నట్లు తేలిందన్నారు. మృతురాలిది కర్నాటక కాదని.. ఆమె వేరే రాష్ట్రం నుంచి వచ్చి కొంతకాలంగా ఒంటరిగా ఉంటోందని వివరించారు. శనివారం ఉదయం ఆమెను చూసేందుకు తల్లి, -చెల్లెలు రావడంతో ఘటన వెలుగులోకి వచ్చిందన్నారు. ఇప్పటికే కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. ప్రస్తుతానికి నిందితుల గురించి ఏమీ తెలీలేదు.