మూవర్స్ అండ్ ప్యాకర్స్ ఏం చేశారో చూడండి.. ఇల్లు ఖాళీ చేస్తుండగా 8లక్షల సొత్తు చోరీ

మూవర్స్ అండ్ ప్యాకర్స్ గురించి విన్నారా.. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు వస్తువులు తరలించేందుకు చాలా మంది మూవర్స్ అండ్ ప్యాకర్స్ కు ఇస్తుంటారు.. హైదరా బాద్, బెంగళూరు లాంటి పెద్ద నగరాలతోపాటు చిన్న చిన్న పట్టణాల్లో మూవర్స్ అండ్ ప్యాకర్స్ టీంలతో కూడిన చాలా కంపెనీలు ఉంటాయి. వస్తువుల తరలించేం దుకు కొంత డబ్బును తీసుకొని పనిచేసి పెడుతుంటారు. అయితే మూవర్స్ అండ్ ప్యాకర్స్  చేసిన నిర్వాకం చూస్తే.. రెంటర్స్ బెంబేలెత్తిపోతున్నారు. ట్రావెలింగ్ లో వస్తువులు పాడవడంతో పాటు చోరీకి గురవుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా బెంగుళూరు ఇల్లు ఖాలీ చేస్తూ వస్తువులను తరలించేందుకు  ఓ మూవింగ్ టీంకు అప్పగించగా.. ఏకంగా 8లక్షల విలువైన వస్తువులను దోచుకెళ్లారు.. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

బెంగళూరు వాసి ఒకాయన అద్దె ఇంటిని మార్చాల్సి వచ్చి వస్తువులను తరలించేందుకు ఓ మూవర్స్ అండ్ ప్యాకర్స్ కంపెనీకి బాధ్యత అప్పజెప్పి జరిగిన నష్టానికి సంబంధించి సోషల్ మీడియా X లో షేర్ చేశారు. ఈ పోస్ట్ లో ట్రాలీలు, బ్యాగ్ లు, సూట్ కేసులు చిందరవందరగా పడివున్న  కొత్త ఇంటి స్థితిని చూపిస్తుంది. 

ఇంటిని మార్చే క్రమంలో వస్తువులను తరలించేందుకు ఏడుగురు ఉన్న మూవర్స్ టీం కు అప్పడించాడు యూజర్.. అయితే కొత్త ఇంటికి చేరిన తర్వాత వస్తువులను చెక్ చేసుకొని షాక్ కు గురయ్యాడు.. ఏకంగా రూ. 8లక్షల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించాడు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వస్తువుల తరలింపు సమయంలో బ్యాగ్ లో రూ 2లక్షల నగదు, జత బంగారు చెవిపోగులు, రెండు బంగారు గాజులు , ఇతర కీలక వస్తువులు దొంగిలించబడ్డాయి. పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారణ జరిపితే నిజాలు  వెలుగులోకి వచ్చాయి. చోరీ చేసినట్లు మూవింగ్ టీమ్ , కంపెనీ మేనేజర్ ఒప్పుకున్నట్లు యూజర్ పోస్టులో రాశారు. 

యూజర్ తనకు జరిగిన చేతు అనుభవాన్ని నెటిజన్లతో పోస్ట్ ద్వారా పంచుకున్నాడు.. ‘‘ నా జీవితంలో అత్యంత భయంకరమైన 48 గంటలు గడిచిపోయాయి. ఆగస్టు 14న ఇంటిని మార్చవలసి వచ్చింది.. దాని కోసం మూవర్స్ అండ్ ప్యాకర్స్ కంపెనీ హాలేఫ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ని అద్దెకు తీసుకున్నాను. కానీ అది నా జీవితంలో చెత్త నిర్ణయం, అదొక పీడకలగా మిగిలిందని యూజర్ మయాంక్ Xలో షేర్ చేశారు.