దేవుడికి హారతి ఇవ్వడానికి కర్పూరం వాడతారని మనకు తెలుసు. కానీ కర్పూరం వల్ల అనేక ఉపయోగాలున్నాయి.
- కర్పూరంలో హారతి కర్పూరం, ముద్దకర్పూరం కర్పూరం, భసకర్పూరం, భీమసేని కర్పూరం, సితాభ్ర కర్పూరం, హిమకర్పూరం తదితర రకాలున్నాయి.
- కర్పూరం వాసన పీలిస్తే చాలు శారీరక రుగృతలన్నీ పోయినట్టు.. సేద తీరినట్టు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స్వల్ప గుండె సమస్యలు, అలసట వంటి వాటికి కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది.
- అర్థరైటిస్, నరాల సమస్యలు, వెన్నునొప్పికి మందుగా పనిచేస్తుంది. పుండు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి పలు రకాల ఇన్ఫెక్షన్లకు ఉపయోగిస్తారు.
- శ్వాస సంబంధ సమస్యల నివారణకు వాడే మందుల తయారీలో కూడా దీనిని ఉపయోగిస్తారు. కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది. అంటువ్యాదులు ప్రబలకుండా చేస్తుంది.
- కళ్ళకు మేలు చేస్తుంది. అందుకే. కాటుకలో కర్పూరాన్ని వాడతారు. జలుబు, కఫాన్ని తగ్గిస్తుంది. మానసిక జబ్బులను సైతం పొగొడుతుంది.
- వేడి చేయడం వల్ల కలిగి ఒళ్లు మంటలు, అరికాళ్ళు, అరచేతుల మంటలు మొదలైనవాటికి పచ్చకర్పూరాన్ని గ్లాసు పాలతో తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతోంది.
.. వెలుగు లైఫ్