Good Health : ఏ పండు.. ఎలాంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది.. హెల్దీ ఫ్రూట్స్ ఇవే..!

ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా.. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలన్నా.. అందరూ ముందుగా సూచించేవి తాజాపండ్లు. రోజూ పండ్లు తినండి ఆరోగ్యంగా ఉండండి అని చెబుతూ ఉంటారు. అన్ని రకాల పళ్లు మంచివే అని సూచిస్తుంటారు. ఫ్రెష్ పండ్లు నిత్యం తీసుకోవడం వల్ల సరైన విటమిన్స్ శరీరానికి అందుతాయి. పండ్లు శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని అందిస్తాయి. అందుకే అందరూ పండ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఏ పండ్లలో ఏమున్నాయో తెలుసా ? ఎలాంటి పండ్లు.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయో తెలుసా ? ఏ పండులో ఏముందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

బొప్పాయి, పుచ్చకాయ : బొప్పాయి, పుచ్చకాయలలో బీటా క్రిపొక్సాంథిన్ గుణాలు ఎక్కువగా వుంటాయి. ఇవి లంగ్ క్యాన్సర్ దరిచేరకుండా కాపాడతాయి. బొప్పాయిలోని పపెయిన్ ఎంజైమ్ జీర్ణశక్తికి సహకరిస్తుంది. అజీర్తితో బాధపడేవారికి బొప్పాయి దివ్యౌషధం. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ ఉంటాయి. పుచ్చకాయలో ఉండే లైకోపీన్ గుండె.. చర్మ సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది.

దానిమ్మ : దానిమ్మ మెదడులో వాపును తగ్గించడంతో పాటు ఆల్జీమర్స్ ను నియంత్రిస్తుంది. విటమిన్ సి, కె కాకుండా రకరకాల పోషకాలతో నిండిన దానిమ్మ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ద్రాక్ష, లిచీ : గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ద్రాక్ష పండ్లను తీసుకోవాలి. ద్రాక్ష, లిచీ పండ్లలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పాలిపినాల్స్ అధికంగా ఉంటాయి. క్యాన్సర్ వంటి వ్యాధులను అరికట్టడంలో పాలిఫినాల్స్ ఉపయోగపడతాయి. బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే లిచీ పండ్లు తింటూ ఉండాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది.

జామ:  తక్కువ ధరకే దొరికే ఒక కప్పు జామపండు ముక్కల్లో లభించే విటమిన్ సి రోజువారీ అవసరాని కంటే ఐదు రెట్లు ఎక్కువ వుంటుంది. వీటిని తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఇందులో విటమిన్‌ ఎ, విటమిన్‌ బి, క్యాల్షియం‌, ఫాస్పరస్‌, పొటాషియం, ఐరన్‌, ఫోలిక్‌యాసిడ్‌ వంటివి మెండుగా ఉన్నాయి. జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్‌ ఇందులో పుష్కలంగా ఉంటుంది. పచ్చిజామకాయలోని టానిస్ మాలిక్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగొడుతాయి.

ALSO READ | Tips for Apples: యాపిల్స్ కొనేటప్పుడు జాగ్రత్త.. పొరపాటును కూడా ఇలాంటివి కొనొద్దు!

కమలా: ఈ పండులో  విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు తినే మహిళల్లో చర్మంపై ముడతలు వచ్చే అవకాశాలు మిగతా వారి కంటే తక్కువగా ఉంటాయి. బ్యాక్టీరియాను ఎదుర్కొనే శక్తి కూడా కమలా పండ్ల నుంచి లభిస్తుంది.

అరటి:  ఏడాది పొడవునా దొరికే అరటి పండు తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి, సహజ చక్కెరలు తక్షణం శరీరానికి అందుతాయి. అరటిపండులో పీచు పదార్థాల మోతాదు కూడా ఎక్కువగా వుంటుంది. రక్తపోటును తగ్గించే పొటాషియం అత్తి, అరటిపండ్లలో లభిస్తుంది.

యాపిల్స్ : కొలెస్ట్రాల్‌ను తగ్గించగల పీచుపదార్థం యాపిల్స్‌లో ఎక్కువగా లభిస్తాయి. రోజుకు అవసరమైన పీచులో నలభై శాతం ఈ పండ్ల నుంచి లభిస్తుంది. పీచుపదార్థాలు ఎక్కువగా తినేవారిలో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటుంది.

నేరేడు:  సంపూర్ణ ఆరోగ్యం కోసం.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు ఎంచుకుంటే మంచిది. అలా ప్రకృతి ప్రసాదితమైనది నేరేడు. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని. అనారోగ్యాల నివారణి. విటమిన్లు, క్రోమియం నేరేడులో పుష్కలంగా ఉంటాయి.

సపోటా పండ్లు : పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది మూత్రపిండాల్లోని రాళ్లను నివారించడంలో సహాయపడుతుంది. ఈ పండ్లు కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలను తగ్గించేందుకు అనువైనవి. అదేవిధంగా పండ్లలో సోడియం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది కిడ్నీలోరాళ్ల వల్ల కలిగే బాధకు ఉపశమనమిస్తుంది.రెగ్యులర్ సపోటా పళ్లు తింటే మలబద్ధకాన్ని నివారించబడుతుంది.

అనాస పళ్లు : కిడ్నీ స్టోన్స్‌ని, పొట్టని కరిగించే అనాస పండు.  ఈ పళ్లలో ఉండే  అనాసపళ్లలో బ్రొమిలిస్ అనే ఎంజైమ్ వాపులను తగ్గిస్తుంది.శరీరానికి బలాన్ని ఇవ్వడంతో పాటు నేత్ర దృష్టిని మెరుగు పరుస్తుంది. పిల్లల చేత తరచుగా ఈ పండు రసం తాగిస్తే ఆకలి పెరుగుతుంది. ఎముకల పెరుగుదల, శారీరక పెరుగుదల ఏర్పడతాయి. అనాస ఆకుల రసం కడుపులోని పురుగుల్ని నాశనం చేస్తుంది. అనాస ఆకుల రసంలో ఒక చెంచా తేనె కలిపి తాగితే విరోచనం అయ్యి కడుపులోని పురుగులు బయటపడతాయి.

 ఉల్లిపాయ:   శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది.పచ్చి ఉల్లిపాయల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణ క్రియను పెంచుతుంది. పేగు కదలికలకు సహాయపడుతుంది. దీనివల్ల మలబద్ధకం వంటి సమస్యలు రావు. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచేందుకు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించేందుకు, ఉల్లిపాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఉపయోగపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఈ పచ్చి ఉల్లిపాయ ఎంతో సహాయపడుతుంది

 రెగ్యులర్ ఫుడ్లో ఆవాలు చేర్చుకుంటే...  ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది. శరీరంలో మెండిగా మారిన ఫ్యాట్ ను సింపుల్ గా తగ్గించుకోవడానికి రెగ్యులర్ డైట్ లో ఆవాలను చేర్చుకోవాలి. ఎందుకంటే రెగ్యులర్ వంటల్లో ఆవాలను  జోడించడం వల్ల వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, మినిరల్స్ , విటమిన్ మరియు ఇతర ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాట్ శరీరాన్ని ఫిట్ గా తయారుచేస్తుంది.

 చేపలు తినడం వల్ల.... రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. చేపల ద్వారా లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి వంటివి ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తాయి. మానసిక ఆరోగ్య సమస్యలను అరికట్టడానికి చేపలు సహాయపడతాయి. కాబట్టి చేపలు తినడం వల్ల సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. చేపలను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు దరిచేరవు.

పంటినొప్పికి దాల్చిన చెక్క... మంచి ఔషదం ..ఈ దాల్చిన చెక్కని వాడితే పంటినొప్పి, చిగుళ్ళ సమస్యలు, చిగుళ్ళలో మంటను నయం చేస్తుంది. కాబట్టి, దీనిని రెగ్యులర్‌గా వాడాలి.

మునగ రసం, మునగ కాయలు ఆకలిని. పెంచుతాయి... మునగాకు రసంలో  షుగర్ తగ్గించే లక్షణాలుంటాయి. మునగాకులో ఎన్నో సూక్ష్మ పోషకాలు ఉంటాయి. మునగకాయలు, ఆకులు తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇందులో పాలలో కంటే ఎక్కువగా కాల్షియం ఉంటుంది. క్యారెట్స్ కంటే ఎక్కువగా విటమిన్ ఎ ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. దీంతో పాటు చాలా లాభాలు ఉన్నాయి.మునగ ఆరోగ్యానికే కాదు. అందానికి కూడా మంచిది. దీనిని తీసుకోవడం వల్ల లివర్ డీటాక్స్ అవుతుంది. అంతేకాకుండా దీని వల్ల జుట్టు కూడా పెరుగుతుంది. మునగ ఆకులు, కొమ్మలు, పూలు, కాయలు ఇలా మునగలోని ప్రతి భాగం ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, కాల్షియం, ప్రోటీన్, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు ఉన్నాయి.

  అరటిపండు గుజ్జు: కాలిన గాయాలకు మగ్గిన అరటిపండు గుజ్జు రాస్తే మంట తగ్గి గాయం త్వరగా నయమవుతుంది.అరటి చెట్టు, పండు, పువ్వులో కూడా అనేక ఔషధ గుణాలున్నాయి. అరటి చెట్టు రసం తీపి, వగరు రుచులు కలిగి ఉంటుంది. చలువ చేస్తుంది. వాతాన్ని పెంచి వీర్య పుష్టి చేస్తుంది. మూత్ర పిండాలలో రాళ్ళను, ఉదరంలోని క్రిములను, సెగరోగములును , రక్తపైత్యాన్ని పోగొడుతుంది.