Good Health : కూల్ డ్రింక్స్ కు బదులు కీర జ్యూస్ తాగండి.. షుగర్ రాదు.. గుండె జబ్బులు రావు..!

 మనలో చాలామంది దాహం. వేసినప్పుడు, చల్లగా తాగాలని అనిపించినప్పుడు కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. కానీ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిలో ఉండే అధిక చక్కెర శరీరంలో కొవ్వుని పెంచుతుంది.దీని ఫలితంగా డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.

అయితే, బరుపు తగ్గాలని అనుకునేవారు కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. వాటికి బదులు కీర దోస జ్యూస్ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. అందులో నీటి శాతం అధికంగా ఉంటుంది, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. సహజంగా బరువు తగ్గాలనుకున్నా, చర్మం ఆరోగ్యంగా ఉండాలనుకున్నా కానీ  కీర దోస జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇది శరీరాన్ని, చర్మాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.

అన్నం తిన్న తర్వాత, నిద్రపోయే ముందు ఉండే గ్యాప్ లో కొన్ని కీరదోస ముక్కలు తింటే నిద్ర బాగా పడుతుంది. ఇలా తినడం వల్ల.. తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటే నిద్ర త్వరగా పడుతుంది. కీరదోస తింటే అజీర్తి సమస్యతో పాటు గ్యాస్ట్రిక్ సమస్య కూడా దూరం అవుతుంది. కాబట్టి,కీరా ముక్కలు తినటం, కీరా జ్యూస్ తాగడం అలవాటు చేసుకోండి అనేక సమస్యల నుండి దూరంగా ఉండండి.