Life Style: జుట్టు రాలిపోతుందా.. అయితే ఉసిరిని ఇలా ఉపయోగించండి...

పూర్వకాలంలో అరవై ఏళ్లలో కూడా జుట్టు నల్లగా  నిగ నిగలాడుతూ ఉండేది. అయితే ప్రస్తుత కాలంలో ఆరేళ్లకే జుట్టు ఊడిపోవడం.. తెల్ల జుట్టు రావడంతోయూత్​ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి జుట్టు రాలడం అనేది ప్రధాన సమస్య. దీనికి కారణం... జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, అనారోగ్య సమస్యల కారణంగా జుట్టు సంబంధిత సమస్యలు ఎక్కువయ్యాయి.  అయితే ఉసిరితో జుట్టును నల్లగా..రాలిపోకుండా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో చూసేద్దాం....

ప్రస్తుత కాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోవడం, చుండ్రు సమస్యలతో జనాలు బాధపడుతున్నారు. ఈ సమస్యల నుండి బయటపడేందుకు చాలా మంది మార్కెట్లో దొరికే  బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. కానీ వాటిని ఉపయోగించిన వలన ఫలితం ఉంటుందో లేదో తెలియదు. పైగా వాటి అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి సమస్యల నుండి బయట పడాలంటే ఉసిరి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉసిరిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా తెల్ల జుట్టు వస్తుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతుంది. ఈ సమస్య నుండి బయటపడాలంటే.. గూస్బెర్రీ పొడితో పాటు ఉసిరి పొడిని నీటిలో కలిపి జుట్టుకి అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. చుండ్రు రావడానికి ప్రధాన కారణం.. స్కాల్ప్ పొడిగా మారటమే.. ఈ సమస్య నుండి బయట పడాలంటే ఉసిరి వాడండి. ఎందుకంటే స్కాల్ప్ కి ఇది మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. తద్వార చుండ్రు సమస్య తొలగిపోతుంది.

ఉసిరిలో విటమిన్ సి, ఫైటో న్యూట్రియంట్లు, అనేక ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఉసిరిని ఉపయోగించడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలతో పాటు, జుట్టు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. అలాగే జుట్టు దృఢంగా మారుతుంది. అనేక కారణాల వల్ల జుట్టు రంగుని కోల్పోతుంది. పోషకాహార లోపం, ఒత్తిడి, నిద్రలేమి సమస్య వలన జుట్టు రంగు మారుతుంది. అయితే ఉసిరిని ఇలా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. బృంగరాజ్ నూనెలో ఆమ్లా పొడిని వేసి జుట్టుకి అప్లై చేస్తే  జుట్టు రంగు మారుతుంది. అలాగే గోరింటాకుతో  ఉసిరి పొడిని కలిపి జుట్టుకి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే జుట్టు రంగు మారుతుంది. అలాగే ఒత్తుగా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.