ఉల్లిపాయ జ్యూస్.. ఇది పట్టిస్తే వద్దన్నా జుట్టు వస్తుందా..!

ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలటం. తీరిక లేని లైఫ్ స్టైల్, ఒత్తిడి, విటమిన్ల లోపం వంటి రకరకాల కారణాల వల్ల జుట్టు రాలే సమస్య అధికమవుతుంది. జుట్టు రాలకుండా కాపాడుకునేందుకు మనమంతా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ పెద్దగా ఫలితం కనిపించదు. ఎంతో ఖర్చుతో కూడుకున్న ప్రయత్నాలు చేసినప్పటికీ జుట్టు రాలే సమస్య తగ్గకపోవడంతో జుట్టు పోతుందన్న ఒత్తిడితో ఆ సమస్య మరింత తీవ్రం అవుతూ ఉంటుంది.

Also Read: కోడి గుడ్లను ఫ్రిజ్ డోర్ ర్యాక్ లో పెడితే త్వరగా పాడవుతాయా..!

అయితే, మనం నిత్యం వాడే, మన వంటింట్లో ఎప్పుడూ స్టాక్ ఉండే ఉల్లిపాయ వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుందంటే నమ్ముతారా?, ఇది నమ్మశక్యంగా లేనప్పటికీ నమ్మి తీరాల్సిన నిజం. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదన్న నానుడి ఈ విషయంలో సరిగా సూట్ అవుతుందని చెప్పచ్చు. ఉల్లిపాయ జ్యూస్ తాగటానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ, క్రమం తప్పకుండా తీసుకుంటే జుట్టు రాలే సమస్యను అధిగమించవచ్చు. ఉల్లిపాయ వల్ల జుట్టుకి ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టును హైడ్రేటెడ్ గా ఉంచుతుంది:

ఉల్లిపాయలో ఉండే పోషకాలు జుట్టును పొడిబారకుండా, ఆరోగ్యాంగా ఉండ్చటంలో తోడ్పడతాయి. జుట్టు రాలడాన్ని ఆపడమే కాకుండా జుట్టు పెరుగుదల కోసం, చుండ్రు నివారణ కోసం కూడా తోడ్పడుతుంది ఉల్లి.

సంపూర్ణ రక్షణ అందిస్తుంది:

ఉల్లిపాయ జ్యూస్ ను  క్రమం తప్పకుండా  వల్ల జుట్టు కావాల్సిన రక్త ప్రసరణ, ఆక్సిజన్ సప్లై సమర్థవంతంగా అందుతుంది. దీనివల్ల జుట్టుకు కావాల్సిన అన్ని పోషకాలు అంది ఆరోగ్యవంతంగా ఉంటుంది.

సహజసిద్ధమైన రంగు, కాంతిని అందిస్తుంది:

ఉల్లిపాయతో సల్ఫర్ అధికశాతంలో ఉండటం వల్ల ఈ జ్యూస్ ను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల జుట్టుకు సహజసిద్ధమైన రంగు, కాంతి వస్తుంది. అంతే కాకుండా తెల్ల జుట్టు రాకుండా కూడా కాపాడుతుంది.

చుండ్రును నివారిస్తుంది:

ఆనియన్ జ్యూస్ క్రమం తప్పకుండా తీసుకుంటే జుట్టు హైడ్రేటెడ్ గా ఉంటుంది కాబట్టి చుండ్రు సమస్య పూర్తిగా తగ్గుతుంది. అంతే కాకుండా తలలో దురద పెట్టడం వంటి సమస్యలను తగ్గించి జుట్టు పెరుగుదల కోసం తోడ్పడుతుంది.