‘డబుల్’ ఇండ్లను ఖాళీ చేయం

‘డబుల్’ ఇండ్లను ఖాళీ చేయం

  • భైంసాలో ఇండ్ల ఆక్రమణ
  • ఖాళీ చేయాలని ఆదేశించిన ఆఫీసర్లు

భైంసా, వెలుగు : ఏడాది క్రితం డ్రా ద్వారా కేటాయించిన డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌రూం ఇండ్లను అప్పగించకపోవడం వల్లే తాము ఆక్రమించుకున్నామని, ఇప్పుడు వాటిని ఖాళీ చేసేది లేదని లబ్ధిదారులు స్పష్టం చేశారు. నిర్మల్‌‌‌‌‌‌‌‌ జిల్లా భైంసాలో మహగాం వెళ్లే దారిలో ఉన్న డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌ రూం ఇండ్లను పలువురు ఆక్రమించుకోవడంతో శనివారం ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ ఈఈ అశోక్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, డీటీ అశోక్, రెవెన్యూ ఇన్స్‌‌‌‌‌‌‌‌పెక్టర్‌‌‌‌‌‌‌‌ కృష్ణగౌడ్, జయరావు డబుల్‌‌‌‌‌‌‌‌ ఇండ్ల వద్దకు వెళ్లి ఖాళీ చేయాలని ఆదేశించారు.

అన్ని వసతులు కల్పించిన తర్వాతే ఇండ్లను అలాట్‌ చేస్తామని అప్పటివరకు ఎవరూ ఉండొద్దని చెప్పారు. దీంతో లబ్ధిదారులు ఆఫీసర్లను ముట్టడించి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండ్లను ఖాళీ చేసేది లేదని స్పష్టం చేశారు. బలవంతంగా ఖాళీ చేయిస్తే ఆందోళనకు దిగుతామని హెచ్చరించడంతో ఆఫీసర్లు అక్కడి ఉంచి వెళ్లిపోయారు.