‘డబుల్‌‌‌‌’ ఇండ్లను కేటాయించండి

సూర్యాపేట, వెలుగు : డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూం ఇండ్ల పట్టాలు ఇచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఇండ్లను అలాట్‌‌‌‌ చేయడం లేదంటూ పలువురు లబ్ధిదారులు బుధవారం సూర్యాపేట ఆర్డీవో ఆఫీస్‌‌‌‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పట్టాలు ఇచ్చిన ఆఫీసర్లు ఇప్పటివరకు ఇండ్లను హ్యాండోవర్‌‌‌‌ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. కిరాయి ఇండ్లల్లో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు రోజుల్లో ఇండ్లను పంపిణీ చేయకుంటే తామే ఇండ్లలోకి వెళ్తామని స్పష్టం చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఆర్డీవో వేణుగోపాల్‌‌‌‌ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు 804 మందికి డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌ రూం ఇండ్లు మంజూరు చేశామని, వాటిలో 384 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయని చెప్పారు. ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ ఆఫీసర్లచో చర్చించి మిగిలిన ఇండ్ల నిర్మాణంపై రిపోర్ట్‌‌‌‌ను కలెక్టర్‌‌‌‌కు అందజేస్తామన్నారు. ఇండ్లు పూర్తయిన వెంటనే అందరికీ కలిపి ఒకేసారి ఇండ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన విరమించారు.