ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్టోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూరం.. తొలిసారి వేలానికి జేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ముంబై: ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్టు టీమ్ కెప్టెన్ బెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ సీజన్ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా దూరంగా ఉంటున్నాడు. మెగా వేలం కోసం స్టోక్స్ తన పేరును రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోలేదు. అదే సమయంలో ఇంగ్లండ్ మాజీ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 42 ఏండ్ల జేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండర్సన్ తొలిసారి వేలానికి వస్తున్నాడు. ఇటలీకి చెందిన పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ థామస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రాకా, ఇండియాలో పుట్టి అమెరికాకు ఆడుతున్న మరో ఫాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సౌరభ్ నేత్రవాల్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ నెల 24,  25వ తేదీల్లో జెడ్డాలో జరిగే వేలానికి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మొత్తం 1,574 మంది ప్లేయర్లతో కూడిన ఈ జాబితాను ఫ్రాంచైజీలతో సంప్రదింపుల తర్వాత బీసీసీఐ  కుదించనుంది.

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయా ఫ్రాంచైజీలు వదులుకున్న  ఇండియా స్టార్ ప్లేయర్లు రిషబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కేఎల్ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యుజ్వేంద్ర చహల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండు కోట్ల కనీస ధరతో వేలంలోకి రానున్నారు. గాయం కారణంగా నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరమైన మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షమీ, లెఫ్టార్మ్ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఇదే ధరలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. రెండు కోట్ల బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాబితాలో ఖలీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ముకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అవేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇషాన్ కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఉన్నారు. 

ఒకప్పుడు ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేలంలో అత్యధిక రేటు అందుకున్న ఇంగ్లండ్ స్టార్ ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్ బెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫోకస్ పెట్టేందుకు గతేడాది లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడలేదు.  ఇక,ఈ ఏడాదే టెస్టు క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రిటైరైన అండర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన చివరి టీ20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పదేండ్ల కింద ఆడటం గమనార్హం. ఇప్పటివరకూ ఒక గ్లోబల్ టీ20 లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడని అండర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన కనీస ధరను రూ. 1.25 కోట్లు నిర్ణయించుకున్నాడు. ఇక, సౌరభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేత్రవాల్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈఏడాది యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. రూ. 30 లక్షల ధరతో వేలంలోకి వస్తున్నాడు.

ఎవరీ థామస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రాకా..?

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన తొలి ఇటలీ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా థామస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రాకా నిలిచాడు. 24 ఏండ్ల ఈ మీడియం పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అరంగేట్రం చేసి ఇప్పటివరకు నాలుగు ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో పోటీ పడ్డాడు. ఆగస్టులో జరిగిన గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీ20 కెనడా లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆకట్టుకున్నాడు. ఆ టోర్నీలో ఆరు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. 10.63 సగటు, 6.88 ఎకానమీతో టోర్నీలో సెకండ్ హయ్యెస్ట్ వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. యూఏఈలో జరిగే ఐఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ20లో పాల్గొనే ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాజమాన్యానికి చెందిన ఎంఐ ఎమిరేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇటీవలే ఎంపికయ్యాడు. ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్ల కేటగిరీలో డ్రాకా రూ. 30 లక్షలతో ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేలానికి రిజిస్టర్‌‌ చేసుకున్నాడు.