Good Food : బీట్ రూట్ తిన్నా.. తాగినా.. ఆక్సిజన్ పెరిగి నీరసం తగ్గుతుంది

శక్తిని, ఆరోగ్యాన్ని అందించే కూరగాయల జాబితాలో బీట్ రూట్ మొదటిది. కానీ దీన్ని తినడానికి చాలామంది అంతగా ఇష్టపడరు. కూర ఇష్టం లేనివాళ్లు, పచ్చిగా తినలేని వాళ్లు జ్యూస్ చేసి తాగితే చాలా లాభం.

బీట్ రూట్ జ్యూస్ కనీసం రెండు రోజులకు ఒకసారైనా ఒక గ్లాస్ తాగితే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

• మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య రక్తహీనత. ఇది ఐరన్ లోపం వల్ల, వస్తుంది. వాళ్లు రోజూ ఒక కప్పు బీట్ రూట్ ముక్కలు తింటే ఐరన్ పెరిగి, రక్తహీనత నుంచి బయటపడొచ్చు. 
• బీట్ రూట్ తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. అందువల్ల శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ లభిస్తుంది.
• జ్యూస్ లేదా పచ్చిముక్కలు తిన్నా కూడా నీరసం తగ్గుతుంది. ఒక బీట్ రూట్, ఒక క్యారెట్ కలిపి జ్యూస్ చేసి, దానిలో ఒక చెక్క నిమ్మరసం పిండి తాగితే రోజంతా యాక్టివ్ ఉంటుంది. 
• దీనిలో విటమిన్ బి, సిలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల హై బీపీ అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు రావు. 
• పిల్లలకు బీట్ రూట్ జ్యూస్ క్రమం తప్పకుండా ఇస్తే వాళ్ల శరీరానికి పోషకాలు అంది ఆరోగ్యంగా
ఎదుగుతారు.