Beauty Tips : సెలూన్కు వెళ్లకుండానే.. ఇంట్లోనే అందమైన జుట్టు కోసం ఇలా చేయొచ్చు

చుండ్రు, జుట్టు చిగుళ్లు చిట్లడం, పొడిబారడం.. అన్నింటికీ మించి హెయిర్ ఫాల్. ప్రస్తుతం అందరి కంప్లైంట్స్ ఇవే. ఎంత ఖరీదైన ప్రొడక్ట్స్ వాడినా.. ఎన్ని రకాల హెయిర్ ట్రీట్మెంట్స్ చేయించినా.. వీటి కథ మళ్లీ మొదటికే వస్తుందంటారు. మరి దీనికి సొల్యూషనే లేదా? అంటే ఉంది. అది కూడా మన వంటింట్లోనే... హెయిర్ కేర్ కి వంటింటి చిట్కాలు బోలెడున్నాయి.. 

అయితే, వాటిల్లో ఏవి? ఎంత వరకు? ఎఫెక్టివ్గా పని చేస్తాయన్నది చెప్పలేం. కానీ, బియ్యం, కలబంద, ఫ్లాక్ సీడ్స్ (అవిసెగింజలు)తో తయారుచేసిన హెయిర్ ప్యాక్ వంద శాతం రిజల్ట్ ఇస్తుంది అంటున్నారు డాక్టర్ విధూషి జైన్.

  • జుట్టుకి ఏ చిన్న సమస్యాచ్చినా.. పార్లర్ ట్రీట్మెంట్ ఆప్షన్గా పెట్టుకుంటారు చాలామంది. 
  • అవన్నీ అప్పటికీ జుట్టుని అందంగా కనిపించేలా చేస్తాయి. 
  • కానీ, వాటిలో వాడే కెమికల్స్, స్టైలింగ్ టూల్స్ వల్ల రానురాను జుట్టు డ్యామేజ్ అవుతుంది.
  • అందుకే వీలైనంతవరకు జుట్టు సమస్యల్ని నేచురల్ గానే క్యూర్ చేసుకోవాలి.
  • అందుకు బెస్ట్ ఆప్షన్ రైస్ ప్యాక్ అంటోంది ఫేమస్ హెయిర్ ఎక్స్పర్ట్, డెర్మాలింక్స్ మెడికల్ హెడ్ విధూషి.
  • ఈ ప్యాక్ పాడైన జుట్టుని ఎలా రిపేర్ చేస్తుందంటే.. 

కెరటిన్ లేకుండానే...

జుట్టు అందం, ఆరోగ్యంలో కెరటిన్ కీ రోల్. కానీ, రైస్ కెరటిన్ ఉండదు. మరి ఇదెలా జుట్టుని రిపేర్ చేస్తుందంటే.. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమయ్యే అమైనో యాసిడ్స్, విటమిన్-ఇ, బిరైస్ లో ఎక్కువ. ఫ్లాక్స్ సీడ్స్ లో ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్, కార్బో హైడ్రేట్స్, నేచురల్ షుగర్స్ కూడా ఉంటాయి. కలబంద జుట్టు క్యుటికల్స్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దాంతో ఈ మూడింటిని కలిపి ప్యాక్ వేసుకుంటే ఇంట్లోనే జుట్టుకి పార్లర్ ట్రీట్మెంట్ అందుతుంది. 

ఇలా చేయాలి..

ఈ ప్యాక్ ఎలా తయారుచేసు కోవాలంటే... పాన్ లో అరకప్పు రైస్, అరకప్పు ఫ్లాక్స్ సీడ్స్ వేసి ఒక గ్లాస్ నీళ్లు పోయాలి. సన్నటి మంట మీద ఆ మిశ్రమాన్ని పావుగంట మరిగించి స్టవ్ ఆపేయాలి. ఆ తరువాత నీళ్లు (గంజి) వార్చాలి. ఉడికించిన రైస్, ఫ్లాక్స్ సీడ్స్, కలబంద ముక్క మిక్సీ పట్టి పేస్ట్ చేయాలి. ఆ పేస్ట్ని మాడుతో పాటు కుదుళ్లకి, జుట్టుకి పట్టించాలి. గంట తర్వాత గోరు వెచ్చని నీళ్లతో కడగాలి. ఇలా వారానికొకసారి నాలుగైదు నెలల పాటు చేస్తే జుట్టు హెల్దీగా ఉంటుంది.