కామారెడ్డి జిల్లా : లింగం పేట మండలం మేంగారం, బోనాల్ గ్రామాల మధ్య మార్గంలో ఎలుగు బంటి సంచారం కలకలం రేపింది. ఎలుగుబంటి సంచారంతో ఆ రోడ్డు గుండా వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. గత రెండు రోజుల నుంచి అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి ఎలుగుబంటి మేంగారం రోడ్డు నుంచి గాంధారి రోడ్డు వైపు సంచరిస్తుందని స్థానికులు తెలిపారు. ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలను ఫోన్లలో వీడియో తీశారు. ఎలుగుబంటికి బోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నీటి కోసం అటవీ నుంచి ఎలుగుబంటి రోడ్డుపైకి వచ్చి ఉండవచ్చని ఫారెస్ట్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.