చింతల్‌‌గుట్ట తండాలో ఎలుగుబంటి సంచారం..భయాందోళనలో గ్రామస్తులు

లింగంపేట, వెలుగు : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బోనాల్‌‌ గ్రామపంచాయతీ పరిధిలోని చింతల్‌‌గుట్ట తండా శివారులో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. తండా పక్కనే ఉన్న కుంటలో నీటిని తాగేందుకు నాలుగు రోజులుగా వస్తున్న ఎలుగుబంటిని ఆదివారం సాయంత్రం కొందరు యువకులు వీడియో తీశారు.

 ఎలుగుబంటి సంచారంతో బోనాల్‌‌, మెంగారం గ్రామాల ప్రజలు పొలాల వద్దకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు స్పందించి ఎలుగుబంటిని పట్టుకోవాలని కోరుతున్నారు.