విటమిన్ ఎ, బి, కె, ఫోలేట్, మెగ్నీషియం. ఎక్కువగా ఉండే బీన్స్ ను వారంలో రెండుసార్లైనా తింటే ఎముకలు దృఢంగా పనిచేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిలో విటమిన్లే కాదు పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
విటమిన్ 'ఎ' వల్ల కంటిచూపు, జీర్ణక్రియ మెరుగుపడతాయి. వాయు సంబంధ రోగాలు కూడా దూరమవుతాయి. ఇంకా వీటిల్లో విటమిన్ బి6, సి, థయామిన్ ఉండటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు, వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్ కారకాలపై పోరాడతాయి. మధుమేహ వ్యాధి ఉన్నవాళ్లు రోజూ ఒక కప్పు బీన్స్ తీసుకుంటే చాలా మంచిది.