హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ- సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (సీఈఈపీ), యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (యూసీఈ) 2024-–2025 విద్యా సంవత్సరానికి వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఉద్దేశించిన బీఈ, బీటెక్ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది.
విభాగాలు, సీట్లు: సివిల్: 30 సీట్లు, మెకానికల్: 30, ఎలక్ట్రికల్: 30, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఏఐ అండ్ ఎంఎల్): 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మూడేళ్ల కోర్సులో ఆరు సెమిస్టర్లు ఉంటాయి.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఇండస్ట్రీ/ ఆర్గనైజేషన్/ కంపెనీ తదితర రంగాల్లో ఏడాది పని అనుభవం ఉండాలి. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జులై 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రాతపరీక్ష జులై 21న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.uceou.edu వెబ్సైట్లో సంప్రదించవచ్చు.