రానున్నది బీసీల రాజ్యమే : దాసు సురేశ్

  • బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు  దాసు సురేశ్

ఖమ్మం టౌన్, వెలుగు: ప్రజా విప్లవాలకు నిలయమైన ఖమ్మంలో బీసీల రాజ్యాధికార ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ అన్నారు. ఖమ్మంలోని ఫూలే అంబేద్కర్ అధ్యయన వేదికలో శనివారం జరిగిన ఉమ్మడి జిల్లా బీసీల ముఖ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. తెలంగాణలో రానున్నది బీసీల రాజ్యమేనన్నారు. రాష్ట్రం, దేశంలోని అగ్రకులాలు బీసీల వ్యాపార, రాజకీయ అవకాశాలను హరిస్తున్నాయని ఆరోపించారు. బీసీల ఓట్లను బయటకు పోకుండా కట్టడి చేసేలా వ్యూహాలను  రచిస్తామని చెప్పారు.

50 శాతం బీసీ జనాభా పైబడిన ఖమ్మం జిల్లాలో బీసీ ప్రజా ప్రతినిధులు ప్రాతినిధ్యం కనిపించకుండా పోయిందని, ఆత్మగౌరవం కోసమే బీసీలు రాజ్యాధికార బాట పట్టారన్నారు. అన్ని మండలాల్లో త్వరలోనే పూర్తిస్థాయి కమిటీల ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి క్యాలెండర్​ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సోషల్ జస్టిస్ జేఏసీ చైర్మన్ వీజీఆర్ నారగోని, కొండా పద్మ, రాజేందర్, అడ్వొకేట్ విజయశాంతి, సుంకరి శ్రీనివాస్, కత్తి విజయ్ గౌడ్, వెంకటస్వామి పాల్గొన్నారు.