అత్యాధునిక హంగులతో కొత్త ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ

మూడు డిఫరెంట్ పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు.. వినూత్నమైన సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. అధునాతమైన ఫ్లడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. 45 ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు.. ప్లేయర్ల కోసం 86 డెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు.. ఇలా చెప్పుకుంటూ పోతే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తలమానికమైన కొత్త నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకాడమీ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ)ని బీసీసీఐ సెక్రటరీ జై షా శనివారం ప్రారంభించారు. దీనికి బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌లెన్స్’ అని పేరు పెట్టారు.

కెంపెగౌడ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమీపంలో 40 ఎకరాల సువిశాల స్థలంలో దీన్ని నిర్మించారు.  ఇందులో ప్రధానంగా మూడు గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేశారు. 85 గజాల బౌండరీతో కూడిన గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఎలో ముంబై నుంచి తీసుకొచ్చిన ఎర్రమట్టితో 13 బౌన్సీ పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను రూపొందించారు.  గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–బి, సిలో 75 గజాల బౌండరీ ఉంటుంది. వీటిని ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉపయోగిస్తారు. ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం సహజ, సింథటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గడ్డితో కూడిన ఉపరితలాలను ఏర్పాటు చేశారు. ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఆరు ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రన్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా నిర్మించారు. భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథ్లెట్లకు కూడా ఇక్కడ శిక్షణ ఇస్తామని జై షా వెల్లడించారు. 

కొత్త సెక్రటరీ ఎంపికకు కసరత్తు..

ఐసీసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎంపికైన జై షా స్థానంలో బీసీసీఐ కొత్త సెక్రటరీ ఎంపిక విషయంలో కదలిక వచ్చింది. తన వారసుడిని కనుగొనే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదివారం జరిగిన బీసీసీఐ ఏజీఎంకు హాజరైన సభ్యులు ప్రస్తుత సెక్రటరీ  జై షాను కోరారు. ఇక,   ఏజీఎంలో బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి బోర్డు ప్రతినిధులుగా అరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దుమాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అవిషేక్ దాల్వియా ఎన్నికయ్యారు. ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతినిధిగా వి. చాముండేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాథ్ నామినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏజీఎం ఆమోదించింది. 2025–-2027 ఐపీఎల్ ఆటగాళ్ల వేలానికి ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గవర్నింగ్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన సిఫార్సులకు ఆమోద ముద్ర వేసింది.