అంబేద్కర్ కాలేజీలో ఘనంగా బతుకమ్మ సంబురం

గ్రేటర్​ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. గురువారం అటుకుల బతుకమ్మ నిర్వహించారు. బాగ్ లింగంపల్లి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కాలేజీ ఆవరణలో నిర్వహించిన సంబురాలు సందడిగా సాగాయి. స్టాఫ్, స్టూడెంట్లు బతుకమ్మను పేర్చారు.

ట్రెడిషనల్​డ్రెస్సుల్లో అంతా ఒక్కచోట చేరి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా దాండియా పాటలకు స్టూడెంట్లు స్టెప్పులేస్తూ సందడి చేశారు. కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ విష్ణుప్రియ, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.  

– వెలుగు, ముషీరాబాద్