కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్టీసీకి భారీగా దసరా ఆమ్దానీ

  • పండుగల సందర్భంగా 14 రోజుల్లో రూ.31.50 కోట్ల రాబడి 
  •  కరీంనగర్ రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 61.18 లక్షల మంది ప్రయాణం
  •  వీటిలో మహాలక్ష్మి టికెట్లే 42.34 లక్షలు

కరీంనగర్, వెలుగు: బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ కు భారీగా ఆదాయం సమకూరింది. ఈ నెల 1 నుంచి 16 వరకు(2, 12 తేదీలు మినహా) 14 రోజుల్లో రూ.31.50 కోట్లు రాబడి వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 11 డిపోలు ఉండగా.. వీటి పరిధిలో పండుగ సీజన్ లో 61.18 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. వీరిలో రూ.42.34 లక్షల మంది మహిళలే(మహాలక్ష్మి టికెట్లు) ఉండడం విశేషం. బతుకమ్మ ఆడపడచుల పండగ కావడంతో ఆర్టీసీలో ప్రయాణించిన వారిలో మూడింట రెండొంతుల మంది వారే ఉన్నారని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. 

గోదావరిఖని డిపోకు అత్యధికంగా రూ.5.27 కోట్ల ఆదాయం.. 

బతుకమ్మ పండుగకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో  మహిళలు చాలామంది తమ పిల్లలతో కలిసి పుట్టింటికి పయనమయ్యారు. కరీంనగర్ రీజియన్ పరిధిలో అత్యధికంగా గోదావరిఖని డిపో పరిధిలో 9,79,400 మంది ప్రయాణించగా వీరిలో 6,87,807 మంది ‘మహాలక్ష్మి’ ప్రయాణికులు ఉన్నారు. ఈ డిపోకు అత్యధికంగా రూ.5.27 కోట్ల ఆదాయం వచ్చింది. 

ఆ తర్వాత కరీంనగర్–2 డిపో బస్సుల్లో 6.65 లక్షల మంది ప్రయాణించగా రూ.4.23 కోట్ల ఆదాయం సమకూరింది. జగిత్యాల డిపోకు రూ.4.21 కోట్లు, కరీంనగర్ –1కు రూ.3.38 కోట్లు, వేములవాడకు రూ.2.32 కోట్లు, సిరిసిల్లకు రూ.2.27 కోట్లు, కోరుట్లకు రూ2.25 కోట్లు, హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.2.11 కోట్లు, మంథనికి రూ.1.83 కోట్లు, మెట్ పల్లికి 2.14 కోట్ల ఆదాయం వచ్చింది. 

మూడింట రెండొంతులు మహాలక్ష్ములే.. 

 కరీంనగర్–1 డిపో పరిధిలో 5.51 లక్షల మంది ప్రయాణించగా మహిళలే 3.53 లక్షల మంది ప్రయాణించారు.  హుస్నాబాద్ పరిధిలో 4 లక్షల మందిలో 2.77 లక్షల మంది, హుజూరాబాద్ డిపో పరిధిలో 4.89 లక్షల మందికి 3.25 లక్షల మంది, జగిత్యాలలో 8 లక్షల మందికి 5.70 లక్షల మంది, కోరుట్లలో 4.56 లక్షల మందిలో 3.46 లక్షలు, మంథనిలో 3 లక్షల మందికి 1.98 లక్షలు, మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి పరిధిలో 4.72 లక్షల మందికి 3.60 లక్షలు, సిరిసిల్లలో 4.68 లక్షల మందికి 2.96 లక్షలు, వేములవాడలో 5.16 లక్షల మందికి 3.95 లక్షల మంది మహిళలు ప్రయాణించారు.