పార్లమెంట్​ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయం : పోచారం శ్రీనివాస్​రెడ్డి

పిట్లం,వెలుగు: వచ్చే పార్లమెంట్​ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్​అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని మాజీ స్పీకర్,​ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పిట్లంలో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పోచారం మాట్లాడుతూ గెలుపోటములు సహజమని, ఓటమిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు.

పార్లమెంట్​ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్​పార్టీలకు  దిమ్మతిరిగేలా విజయాన్ని నమోదు చేయాలని కోరారు.అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని, పార్టీ విజయం కోసం కష్టపడి పని చేయాలని సూచించారు.

కాంగ్రెస్​ ప్రభుత్వమిచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హమీలు అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉండాలన్నారు. జుక్కల్​మాజీ ఎమ్మెల్యే హన్మంత్​షిండే మాట్లాడుతూ తాను గెలిచినా, ఓడినా నియోజకవర్గ ప్రజలతోనే ఉంటానన్నారు. జహీరాబాద్​ ఎంపీ బీబీ పాటిల్, జడ్పీటీసీ శ్రీనివాస్​రెడ్డి, లీడర్లు దఫేదార్​రాజు, విజయ్,  వాసరి రమేశ్, అన్నారం వెంకట్రామ్​రెడ్డి, రజనీకాంత్​రెడ్డి పాల్గొన్నారు.