రాఖీ పండుగ రోజు మాత్రమే తెరిచే దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా

భారతదేశం.. దేవాలయాలకు.. ఆచారాలకు సంప్రదాయాలకు నిలయం.. ఆధ్యాత్మిక సభలు.. సమావేశాలు కూడా జరుగుతుంటాయి.   మనదేశం దేవాలయాలకు, ఆధ్యాత్మిక సంపందకు ఎంతో ప్రసిద్ది. లెక్కలేనన్ని అద్భుతాలు భారతదేశంలోనే కనిపిస్తాయి. నిత్యం దేవాలయాలను సందర్శించే వారు కూడా ఉంటారు.  అయితే దేశంలో ఓ దేవాలయం ఏడాదికి ఒక్కరోజు మాత్రమే అంటే.. శ్రావణ పౌర్ణమి... రాఖీ పండుగ, రక్షాబంధన్​ రోజే ఓపెన్​ చేసి పూజలు చేస్తారట.  మిగతా అన్ని రోజులు ఆ గుడికి తాళాలే.. ఇంతకూ అది ఏ దేవుడి గుడి.. ఎక్కడ ఉంది.. దాని విశేషాలను చూద్దాం. . . .

ప్రతి దేవాలయానికి ఒక చరిత్ర ఉంటుంది.  ఆలయాలు వాటివెనుక ఉండే కథలు ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంటాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి దేవాలయం దేనికదే ఒక ప్రత్యేకతతో ప్రాచుర్యంలో ఉంటాయి. నిత్యం పూజలతో శోభిల్లే ఆలయాలు కొన్నైతే..  ఒక్కో ఆలయంలో నెలకొకసారి మాత్రమే పూజలు జరుగుతాయి.

కానీ మనదేశంలో ఒక దేవాలయంలో మాత్రం ఏడాదికి ఒక్కసారే తెరుచుకుంటుంది. ఆ ఒక్క రోజులో కొన్ని గంటలపాటు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంటుంది. ఆ విశిష్టత కలిగిన దేవాలయం ఉత్తరాఖండ్ లో ఉంది. ఉత్తరాఖండ్ లోని బన్షీ నారాయణ ఆలయం  హిమాలయాల్లో ఉంటుంది. ఈ గుడి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ  ఆలయ తలుపులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుచుకుంటాయి. అదికూడా రక్షాబంధన్ రోజునే  ( 2024, ఆగస్టు 19) తెరుస్తారు. ఆ రోజు ఇక్కడ పూజలు జరిపితే విశేషమైన పుణ్యం లభిస్తుందట. అలాగే మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఇట్టే తీరిపోతుందట.

రక్షాబంధన్ రోజున ఇక్కడికి వచ్చే మహిళలు బన్షీ నారాయునుడికి రాఖీ కడతారు. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి ఆగష్టు 19 వ తేదీనా సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 11:55 నిముషాలకు ముగుస్తుంది. ఈ సమయంలోనే ఈ ఆలయంలో దర్శనానికి అవకాశం ఉంటుంది.

పురాణాల కథనం ప్రకారం..

హిందూ విశ్వాసం ప్రకారం బలి అహంకారాన్ని అణిచివేసేందుకు విష్ణువు వామనునిగా అవతరించాడు. ఇంతలో బాలి విష్ణువును తన ద్వారపాలకుడిగా చేస్తానని వాగ్దానం చేసి.. తన ద్వారపాలకుడిగా నియమించుకున్నాడు. అయితే తన భర్త మహా విష్ణువుని తిరిగి తీసుకురావాలని కోరుకుంది. అప్పుడు నారద ముని రాజు బాలికి రక్షా బంధన్ కట్టమని.. లక్ష్మీదేవికి పరిష్కారాన్ని సూచించాడు. మారుమూల లోయలో లక్ష్మీదేవి ఇక్కడ కొలువుదీరిన తర్వాతే రాఖీ పండగను జరుపుకోవడం ప్రారంభమైందని విశ్వాసం.

ఎలా ఆలయానికి వెళ్లాలంటే..

ఈ ఆలయం ఉర్గాం గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే కొన్ని కిలోమీటర్లు నడవాలి. రైలులో వెళుతున్నట్లయితే.. హరిద్వార్ రిషికేశ్ రైల్వే స్టేషన్‌లో దిగాలి. రిషికేశ్ నుండి జోషిమఠం  వరకు దూరం దాదాపు 225 కి.మీ. ఈ లోయ జోషిమఠం  నుండి 10 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ నుండి మీరు ఉర్గాం గ్రామానికి చేరుకోవచ్చు. దీని తర్వాత కాలినడకన వెళ్లి వంశీనారాయణ దేవాలయానికి చేరుకోవాలి.