టూరిస్టు బస్సుపై చిరుత దాడి..భయంతో వణికిపోయిన ప్రయాణికులు..వీడియో వైరల్

ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ..అప్పటివరకు ఆనందంగా కేరింతలు కొడుతున్నారు టూరిస్టులంతా..ఇంతలో ఊహించని సంఘటన..ఒక్కసారిగా చిరుతపులి ప్రత్యక్షం.టూరిస్టులు ప్రయాణి స్తున్న బస్సులోకి ఎక్కేందుకు ప్రయత్నం..బస్సు కిటీకీలనుంచి లోపలికి వచ్చేందుకు యత్నం. టూరిస్టులంతా హడల్..భయంతో కేకలు పెట్టారు. బెంగళూరు బన్నెరఘట్ట నేషనల్ పార్క్ లో టూరిస్టుల బస్సుపై చిరుత దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 ఆ వీడియో చూసేవారికే ఒళ్లు గగుర్లు పొడుస్తోంది..ఇక బస్సుల్లో ఉన్న వారి పరిస్థితి వర్ణించలేం.. ఒక్కసారిగా చిరుత పులి బస్సుల్లోకి దూసుకువస్తుంటే.. టూరిస్టులు భయంతో గట్టిగా అరిచారు. బస్సు కిటికీలకు అద్దాలున్నాయి కాబట్టి సరిపోయింది. లేకపోయింది మా పరిస్థితి ఏంటని సంఘటన తర్వాత ఊహించుకుంటూ గుండెలు పట్టుకున్నారు టూరిస్టులంతా.

బెంగళూరు బన్నెరఘట్ట నేషనల్ పార్క్ దేశంలోనే అతిపెద్ద పార్కు. జంతు ప్రదర్శన శాలలు వన్యప్రాణుల సంరక్షణకు పేరుగాంచాయని వినోదమే కాకుండా జంతు ప్రదర్శణ శాలలు విజ్ణాన కేంద్రాలుగా ఉన్నాయి.  బన్నెరఘట్ట బయోలాజికల్ పార్కుకు వచ్చే ప్రజలు వన్యప్రాణులను చూసి ఎంజాయ్ చేస్తారు. సందర్శకుల కోసం 20 హెక్టార్ల విస్తీర్ణంలో 8 చిరుత పులులను ఈ పార్కులు పెంచుతున్నారు. 

Also Read :- 20వేల మందిని బురిడీ కొట్టించింది స్టాక్ బ్రోకింగ్ కంపెనీ

వన్యప్రాణుల నుంచి టూరిస్టులకు రక్షణ కల్పించేందుకు పార్కులో అన్ని ఏర్పాట్లు చేసినట్లు అక్కడి ప్రభుత్వ, అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో రైల్వే బారికేడ్, 4.5 మీటర్ల ఎత్తులో చైన్ లింక్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశామన్నారు. వన్యప్రాణులు తప్పించుకోకుండా 30 డిగ్రీల స్లాంట్ తో 1.5 మీటర్ల మెటల్ షీట్ లను కూడా ఏర్పాటు చేశారు. 

దీంతో పాటు సెంట్రల్ జూ అథారిటీ జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేస్తున్నారని పార్క్ అధికారులు చెబుతున్నారు. ఎన్ని రక్షణ ఏర్పాట్లు ఉన్నా.. టూరిస్టులు పార్క్ నిర్వాహలకు సలహాలు తీసుకోవాలని కోరుతున్నారు.