బ్యాంక్​ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : జీఎం రితేశ్​ కుమార్

  •     జీఎం రితేశ్​ కుమార్

సిరికొండ, వెలుగు : బ్యాంకింగ్​ సేవలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్​ఆఫ్​బరోడా జీఎం రితేశ్ ​కుమార్​ పేర్కొన్నారు. సిరికొండలో బుధవారం బ్యాంక్ ఆఫ్​బరోడా​కొత్త ఆఫీస్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కస్టమర్ల వినతుల మేరకు స్థానికంగా బ్రాంచీని ఏర్పాటు చేశామన్నారు. సిరికొండ బ్రాంచ్​ఏడాదికి రూ.100 కోట్లకు పైగా టర్నోవర్​సాధించడం గొప్ప విషయమన్నారు.

దేశంలో అత్యధిక కస్టమర్లు కలిగిన బ్యాంకుల్లో తమ బ్యాంక్​ రెండో స్థానంలో ఉందన్నారు. విదేశాల్లోనూ తమ సేవలను విస్తరించామన్నారు. రీజినల్​ఆఫీసర్​ చంద్రశేఖర్, ఎస్​డీబీఎం సూర్య ప్రసాద్, సిరికొండ మేనేజర్  జయప్రకాశ్, రాజశేఖర్, సల్ల రాజరెడ్డి, భూమేశ్ ​పాల్గొన్నారు.