Bank Holidays: జనవరి 2025లో బ్యాంక్ హాలీడేస్.. ఆ తేదీల్లో బ్యాంకులు బంద్

కొత్త సంవత్సరం 2025 వచ్చేస్తుంది.. పాత సంవత్సరం 2024 కి వీడ్కోలు చెప్పి.. కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం.. ఈ క్రమంలో ఈ ఏడాదంతా చేయాల్సిన పనులపై ఓ షెడ్యూల్ వేసుకుంటాం..అలాంటి వాటిలో బ్యాంకులకు వెళ్లాల్సిన పనులు కూడా ఉంటాయి. అయితే బ్యాంకులకు వెళ్లాలంటే.. ముందు వాటి పని దినాలు తెలిసి ఉండాలి. మరి 2025 లో  ప్రారంభ నెల అయిన జనవరిలో బ్యాంకులకు ఏయే రోజు సెలవులు ఉన్నాయో ఓ సారి లుక్కేద్దాం.. 

2025 జనవరి నెలలో చాలారోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. పండుగలు, ఇతర ఈవెంట్లతో బ్యాంకులకు ఆర్బీఐ హాలీడేస్ ప్రకటించిన విషయం తెలిసిందే. మీరు  బ్యాంకుల్లో ఏదైనా ముఖ్యమైన పనులు ప్లాన్ చేసుకుని ఉంటే..2025 జనవరిలో ఉన్న సెలవుల గురించి తప్పకుండా తెలిసుండాలి. 

జనవరిలో నెలలో పండుగలు, నేషనల్ ఈవెంట్లు ఎక్కువగా ఉంటాయి.. ఈ నెలలో బ్యాంకుల్లో కస్టమర్ సేవలకు కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి మీకు బ్యాంకుల్లో ఏదైనా పని ఉంటే సాధ్యమైనంత వరకు ముందుగానే చేసుకోవాలి. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. జనవరి నెలలో పబ్లిక్ హాలీడేస్,  ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ సెలవు రోజుల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయ హాలిడేస్ ను నిర్ణయిస్తాయి.

 ప్రతి నెలా రెండు , నాలుగో శనివారాల్లో  బ్యాంకులు మూసివేయబడతాయి. వీటితోపాటు జాతీయ సెలవులు, ప్రాంతీయ సెలవులు, ప్రభుత్వ సెలవులు ఉంటాయి. ముందస్తుగా బ్యాంకులకు ఉన్న సెలవులను మనం తెలుసుకుంటే.. బ్యాంకు పనులు సులభతరం అవుతాయి. 

2025 జనవరి నెలలో బ్యాంకు సెలవుల జాబితా

జనవరి1:-బుధవారం- నూతన సంవత్సరం
జనవరి 2: నూతన సంవత్సరం, మన్నం జయంతి (రాష్ట్ర సెలవుదినం)
జనవరి5 : ఆదివారం
జనవరి6 : సోమవారం- గురుగోవింద్ సింగ్ జయంతి
జనవరి11: శనివారం- మిషనరీ డే, రెండో శనివారం
జనవరి 12: ఆదివారం- స్వామి వివేకానంద జయంతి
జనవరి13 : సోమవారం- లోహ్రి
జనవరి14 : మంగళవారం- మకర సంక్రాంతి, మాగ్ బిహు ,పొంగల్ (తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో జరుపుకుంటారు)
జనవరి15: బుధవారం- తిరువళ్లువర్ దినోత్సవం (తమిళనాడులో జరుపుకుంటారు) ,తుసు పూజ (పశ్చిమ బెంగాల్ ,అస్సాంలో జరుపుకుంటారు)
జనవరి 16: ఉజ్జవర్ తిరునాల్
జనవరి19 : ఆదివారం
జనవరి22 : ఇమోయిన్
జనవరి23 : గురువారం- నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి
జనవరి25: శనివారం- నాల్గో శనివారం
జనవరి 26: ఆదివారం- గణతంత్ర దినోత్సవం
జనవరి30 : సోనమ్ లోసర్