బంగ్లాదేశ్ రాజ్యాంగంలో సెక్యులరిజం పదాన్ని తీసెయ్యాలి : మొహమ్మద్ అసదుజ్జమాన్

  • ఆ దేశ సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ వాదన 

ఢాకా: బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచి సెక్యులరిజం, సోషలిజం అనే పదాలను తొలగించాలని ఆ దేశ సుప్రీంకోర్టును అటార్నీ జనరల్ మొహమ్మద్ అసదుజ్జమాన్ కోరారు. షేక్ ముజిబర్ రెహమాన్‌ను జాతిపితగా పేర్కొనే నిబంధనను కూడా తొలగించాలన్నారు. రాజ్యాంగంలోని 15వ సవరణ చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్‌ను బంగ్లా సుప్రీంకోర్టు బుధవారం విచారించింది.

ఈ సందర్భంగా అటార్నీ జనరల్ వాదిస్తూ.. దేశంలో 90 శాతం మంది ప్రజలు ఒకే మతానికి చెందినవారు కావడంతో సెక్యులరిజం అనే పదం అవసరం లేదన్నారు. "ఆర్టికల్ 2ఏ అన్ని మతాలకు సమాన హక్కులు, ఆర్టికల్ 9 బెంగాలీ జాతీయత గురించి చెప్తాయి. ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించేలా కాకుండా, నియంతృత్వంలా ఉంది" అని పేర్కొన్నారు.