మిస్టరీ ఏంటీ : చెరువులో శవంగా కనిపించిన 32 ఏళ్ల మహిళా టీవీ జర్నలిస్ట్

బంగ్లాదేశ్ లో టీవీ జర్నలిస్ట్ అనుమానస్పదంగా మృతి చెందింది. రాజధాని ఢాకాలోని హతిర్‌ జీల్ సరస్సులో ఆమె మృతదేహాం స్వాధీనం చేసుకున్నట్లు  స్థానిక మీడియా తెలిపింది.  గాజీ టీవీలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్న సారా రహనుమా (32)  మృతదేహం ఆగస్టు 28న  హతిర్‌ జీల్ సరస్సుపై తేలుతూ కనిపించిందని  సాగర్ అనే వ్యక్తి  వెల్లడించాడు. అయితే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారని చెప్పాడు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆమెది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ALSO READ | ఇలాంటి అఘాయిత్యాలను ఏ నాగరిక సమాజం సహించదు:రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

 అయితే జర్నలిస్ట్ రహనుమా చనిపోయే ముందు రోజు ఆమె ఫేస్ బుక్ లో ఓ పోస్ట్  పెట్టారు.   నీలాంటి స్నేహితుడిని కలిగి ఉండటం చాలా ఆనందంగా ఉంది.  నీలాంటి స్నేహితుడు ఉన్నందుకు  ఆనందగా ఉంది.   దేవుడు నిన్ను ఎప్పటికీ  చల్లగా చూస్తాడు. త్వరలో నువ్వు అనుకున్న  కలలన్నీ నెరవేరుతాయి. కలిసి చాలా ప్లాన్ చేసుకున్నామని నాకు తెలుసు. నెరవేర్చలేకపోతున్నందుకు నన్ను క్షమించు అని పోస్ట్ చేసింది. అంతకముందు పోస్ట్‌లో చావుతో సమానమైన జీవితాన్ని గడపడం కంటే చనిపోవడం ఉత్తమం అని రాసింది.