ఇవ్వాల కరీంనగర్​కు బండి సంజయ్

  • కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి పర్యటన 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ ఎంపీగా గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ తొలిసారిగా బుధవారం కరీంనగర్ కు వస్తున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి.  ఉదయం 9 గంటలకు శనిగరం వద్దకు చేరుకుంటారు. శ్రేణులతో కలిసి కరీంనగర్ చేరుకుని మహాశక్తి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

అనంతరం చైతన్యపురిలోని తన నివాసానికి వెళ్లి తన తల్లి ఆశీస్సులు తీసుకుంటారు. అక్కడి నుంచి కొండగట్టు చేరుకొని అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి  ఆలయం, ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు వేములవాడకు చేరుకుంటారు. రాజన్నకు ప్రత్యేక పూజలు చేసి కార్యకర్తలతో మాట్లాడుతారు. సాయంత్రం 7 గంటలకు సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రానికి చేరుకుని మార్కండేయ దేవాలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కరీంనగర్ చేరుకుంటారు.