కరీంనగర్ పార్లమెంట్ చరిత్రలో సంజయ్ దే మెజార్టీ

  • కేసీఆర్, వినోద్ కుమార్ రికార్డులను బ్రేక్ చేసిన బండి 

కరీంనగర్/కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేరిట  నమోదైన మెజార్టీ రికార్డులను బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తిరగరాశారు.  కరీంనగర్ పార్లమెంట్ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీగా సంజయ్ రికార్డు సృష్టించారు. తెలంగాణ ఉద్యమ టైంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేసీఆర్ రాజీనామా చేయడంతో కరీంనగర్ లోక్ సభ స్థానానికి 2006 లో ఉప ఎన్నిక జరిగింది. 

ఈ ఎన్నికలో కేసీఆర్ కు 2,01,581 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆ తర్వాత 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు 2,05 ,007 ఓట్ల మెజార్టీ వచ్చింది. దీంతో కేసీఆర్ రికార్డును వినోద్ బ్రేక్ చేసినట్లయింది. తాజా ఎన్నికలో 2,25, 209 ఓట్ల మెజార్టీతో బండి సంజయ్ వారిద్దరి రికార్డులను బ్రేక్ చేశారు.