జిట్టా ప్రజల మనిషి.. ఆయన లేని లోటు తీరనిది: గవర్నర్ దత్తాత్రేయ

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి  ప్రజల మనిషి అని.. ఆయన లేని లోటు తీరనిదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురై మృతి చెందిన జిట్టా దశదిన కర్మను ఇవాళ (సెప్టెంబర్ 15) యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆయన స్వగ్రామంలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దత్తాత్రేయ జిట్టా చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిట్టా మరణం  నన్ను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం అంకితభావంతో పని చేసిన వ్యక్తి జిట్టా బాలకృష్ణ రెడ్డి అని కొనియాడారు. 

ALSO READ | తెలంగాణ అమరవీరులకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నివాళులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో  ప్లోరైడ్ బాధితులతో విశేషంగా పోరాడిన వ్యక్తి జిట్టా అని గుర్తు చేశారు. పదవులు లేకపోయిన జిట్టా బాలకృష్ణ రెడ్డి ప్రజల మనసులలో నిలిచిపోయాడన్నారు. జిట్టా ఎంతో మంది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పని వ్యక్తి అని..  స్వంత డబ్బులతో తెలంగాణ ఉద్యమాన్ని నడిన గొప్ప వ్యక్తి జిట్టా అని ప్రశంసించారు. జిట్టా కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. జిట్టా బాలకృష్ణ రెడ్డి ఆశయాల కొరకు మన అందరం కలిసి పని చేద్దామని ఈ సందర్భంగా దత్తాత్రేయ పిలుపునిచ్చారు.