ఈ ఆలయ మహిమ తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే... సూర్యుడితో పాటు త్రిశూలం కూడా తిరుగుతుంది..

హిందూ మత విశ్వాసాల ప్రకారం, అనేక దేవాలయాలు రకరకాల ఆచారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు ఉన్నాయి. అంతేకాదు కొన్ని ఆలయాల్లో నిగూఢమైన, భయానక రహస్యాలు కూడా ఉన్నాయని మనకు చరిత్ర, పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ విచిత్రమైన మిస్టరీ దేవాలయం  ( శివాలయం) గురించి గురించి తెలుసుకుందాం. . .

ఉత్తర్ ప్రదేశ్ రాయ్ బరేలీ జిల్లాలోని లాల్‌గంజ్ తహసీల్ పరిధిలోని బల్హేమౌ గ్రామంలో ఉన్న బల్హేశ్వర్ లో.. సుమారు 500 సంవత్సరాల పురాతన శివాలయం ఉంది. ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది.   గోపురంపై ఉన్న త్రిశూలం సూర్యుని గమనానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది.  ఈ ఆలయ సముదాయంలో ఒక సరస్సు కూడా ఉంది. భారతదేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు మరియు నదుల నుండి నీటిని తీసుకువచ్చి ఈ ఆలయంలోకి పోశారని ప్రజలు నమ్ముతారు. దీని ద్వారా శివునికి జలాభిషేకం చేస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులందరూ ఈ సరస్సు నుండి నీటిని తీసుకొని స్వామికి జలాభిషేకం చేస్తారు.

ఈ ఆలయంలోని శివలింగం స్వయం భూ అని చెపుతారు. పూర్వం ఇక్కడ విశాలమైన అడవి ఉండేదని ప్రజలు అంటున్నారు. సమీపంలోని గ్రామం నుంచి ఆవులు మేతకు వచ్చేవి. ఇక్కడికి మేతకు వచ్చే ఆవు ఒకటి పాలు ఇవ్వడం మానేయడంతో.. పాలను ఎవరో దొంగలిస్తున్నారని యజమాని భావించాడు. అయితే ఆవు పాలు ఆవుని అనుసరించగా.. పాలు ఓ పుట్టదగ్గర పాలు ఇవ్వడాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా.. వారు అక్కడికి వెళ్లి చూడగా శివలింగం కనిపించడంతో పూజలు చేయడం ప్రారంభించారు.

ALSO READ :- నాగ్‌పూర్ జైలు నుంచి విడుదలైన ప్రొఫెసర్ సాయిబాబా

ఈ ఆలయ సముదాయంలో దుర్గ గుడి కూడా ఉంది. నవరాత్రులలో ఇక్కడికి వస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రజలలో ఒక నమ్మకం. అందుకే నవరాత్రి రోజుల్లో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయం సుమారు 500 సంవత్సరాల నాటిదని  ఆలయ ప్రధాన పూజారి  బల్హేశ్వర్ మహాదేవ్ ఝిల్మిల్ మహారాజ్  చెప్పారు. ఇక్కడ ఉన్న శివలింగం స్వయంభూ అని ... అంతేకాకుండా దాని ప్రాంగణంలో ఒక సరస్సు కూడా ఉంది. దీని గురించి పూర్వీకులు భారతదేశంలోని అన్ని ప్రధాన పుణ్యక్షేత్రాలు మరియు నదుల నుంచి నీటిని తీసుకొచ్చి సరస్సులో పోయారని చెబుతారు. అప్పటి నుండి శివుని జలాభిషేకం ప్రారంభమైంది. అప్పటి నుండి నేటి వరకు ఇక్కడికి వచ్చే భక్తులందరూ ఈ సరస్సు నుండి నీటిని తీసుకొని శివునికి జలాభిషేకం చేస్తారు. ప్రతి సోమవారం ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.