బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసిందోచ్.. ధర, వేరియంట్లు, ఫీచర్లు పూర్తివివరాలివే..

బజాజ్​ చేతక్​.. బజాజ్​ కబ్​ స్కూటర్ల పేర్లు జమానాలో విన్నాం... వింటమే కాదు ఆ రోజుల్లో వాటికున్న డిమాండ్​ అంతా ఇంతా కాదు.టూవీలర్ బైక్​ తయారీ సంస్థ బజాజ్​ కంపెనీకి ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. తాజాగా మార్కెట్లో ఎలక్ట్రిక్​ బైక్​ లు హవా నడుస్తోంది.  ఈ నేపథ్యంలో బజాజ్​ సంస్థ కొత్త కొత్త ఈవీ స్కూటర్లను మార్కెట్​ లోకి రిలీజ్​ చేస్తోంది.  ఇందులో భాగంగా కొత్త మోడల్​ ఎలక్ట్రిక్ బైక్​ చేతక్​ 2901 ని మార్కెట్​ లోకి విడుదల చేసింది.  ఈ బైక్​ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. . .

బజాజ్ కంపెనీకి చెందిన చేతక్​ 2901  కొత్త ఎలక్ట్రిక్​ ఈవీ వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది.  రెడ్, వైట్, బ్లాక్‌తో సహా లైమ్ ఎల్లో, అజూర్ బ్లూ షేడ్స్‌లో  స్ట్రాంగ్​ బాడీ...  న్యూ టెక్నాలజీతో తయారు చేశారు.  ఇందులో  కలర్ డిజిటల్ కన్సోల్, అల్లాయ్ వీల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.  ఈ కొత్త చేతక్ 2901 రోజువారీ ఉపయోగం కోసం  రూపొందించబడిందని కంపెనీ పేర్కొంది. వీటితో పాటు హిల్ హోల్డ్, రివర్స్, స్పోర్ట్, ఎకానమీ మోడ్‌లు, కాల్, మ్యూజిక్ కంట్రోల్, ఫాలో మి హోమ్ లైట్లు, బ్లూటూత్ యాప్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను జోడించే TecPacతో రైడర్‌లు తమ అనుభవాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు. బజాజ్ ఆటో అర్బనైట్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ మాట్లాడుతూ.. ‘‘చేతక్ 2901 స్కూటర్ కస్టమర్ల బడ్జెట్‌ను పెంచకుండా పెట్రోల్ స్కూటర్ కస్టమర్‌లను ఆకర్షించేలా డిజైన్ చేయబడింది.

ఇక దీని ధర విషయానికొస్తే  రూ. 95,998 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. కాగా ఇది 123km (ARAI- సర్టిఫైడ్) ఆకట్టుకునే పరిధిని అందిస్తోంది. కంపెనీ దీనినిచేతక్ 2901లోఅలాగే మోడల్ మంచి పరిమాణ 2.88kWhతో వస్తుంది. అంతేకాకుండా గరిష్ట వేగం గంటకు 63కిమీకి పరిమితం చేయబడింది.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు జూన్ 15 నుండి రిటైల్ ప్రారంభమవుతుందని  తెలిపారు. భారతదేశంలోని 500 షోరూమ్‌లు ఇప్పుడు చేతక్ స్కూటర్‌లను అందిస్తున్నాయి. మంచి ఫీచర్లు, మైలేజీ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తక్కువ ధరలోనే కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇదే బెస్ట్ ఛాయిస్‌గా చెప్పుకోవచ్చు.