బచావత్ ట్రిబ్యునల్..కృష్ణా జలాల్లో తెలుగు రాష్ట్రాల నీటి వాటా ఎంత.?

బచావత్ ట్రిబ్యునల్ 

  • హెల్సెంకీ నియమం నదీ జలాల పంపిణీ గురించి తెలుపుతుంది. 
  • అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956లో ఏర్పాటు చేశారు. 
  • కృష్ణా జలాల వివాదంపై మొదటి ట్రిబ్యునల్​ బచావత్​ ట్రిబ్యునల్​.
  • కేంద్ర ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్–1ను 1969లో ఏర్పాటు చేశారు. 
  • బచావత్​ ట్రిబ్యునల్​ కృష్ణా జలాల పంపిణీ చేస్తూ 1973లో తీర్పు ఇచ్చింది.
  • బచావత్​ ట్రిబ్యునల్​ తన తీర్పులో ప్రకటించిన మొత్తం కృష్ణా నికర జలాలు 2060 టీఎంసీలు.
  • బచావత్​ ట్రిబ్యునల్ అవార్డ్​లో భాగంగా​ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు 800 టీఎంసీల నికర జలాలను కేటాయించింది. 
  • బచావత్​ ట్రిబ్యునల్​ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు 11 టీఎంసీల మిగులు జలాలను కేటాయించింది.
  • బచావత్​ ట్రిబ్యునల్​లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు మొత్తం 811 టీఎంసీల నీటిని కేటాయించింది.
  • 1977లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్​లు మానవీయ కోణంలో ఆలోచించి చెన్నై నగరానికి 15 టీఎంసీల తాగునీటిని సరఫరా చేసేందుకు అంగీకరించారు. 
  • బచావత్​ ట్రిబ్యునల్​ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు కేటాయించిన జలాలను ఆంధ్రప్రదేశ్​ విభజన చట్టం ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 512: 299 టీఎంసీలు పంచుకుంటున్నాయి. 
  • చెన్నై నగరానికి తాగునీటిని తెలుగుగంగ 
  • ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను తరలిస్తున్నారు. 
  • కృష్ణా ట్రిబ్యునల్​ –2ను బ్రిజేష్​కుమార్​ ట్రిబ్యునల్​ అని కూడా పిలుస్తారు. 
  • బ్రిజేష్​ కుమార్​ ట్రిబ్యునల్​ 2004లో ఏర్పడింది.
  • బ్రిజేష్​ కుమార్​ ట్రిబ్యునల్​ కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ తన తీర్పును 2010లో బహిర్గతం చేసింది. 
  • బ్రిజేష్​కుమార్​ ట్రిబ్యునల్​ తీర్పు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు 1001 టీంఎసీల కృష్ణాజలాలనుకేటాయించారు. 
  • రాష్ట్ర స్థూల నీటిపారుదల విస్తీర్ణం 20.27 లక్షల హెక్టార్లలో ఉంది.
  • తెలంగాణలో మొత్తం నీటిపారుదలలో 89శాతం బావుల ద్వారా సాగవుతుంది.
  • అత్యధిక శాతం నీటిపారుదల వసతులు కలిగిన జిల్లా మేడ్చల్​.
  • అత్యల్ప శాతం నీటిపారుదల వసతులు కలిగిన జిల్లా ఆదిలాబాద్​.
  • రాష్ట్రంలో చెరువుల ద్వారా సాగయ్యే వ్యవసాయ భూమి 1.21 లక్షల హెక్టార్లు. 
  • తెలంగాణలో కాలువల ద్వారా సాగయ్యే వ్యవసాయ భూమి 3 శాతం.
  • జాతీయ జల విజ్ఞాన సంస్థను 1979లో స్థాపించారు. 
  • జాతీయ జల విజ్ఙాన సంస్థ ప్రధాన కార్యాలయం రూర్కీలో ఉంది. 
  • చెలిమెల వాగు ప్రాజెక్టుకు ఎన్​టీఆర్​ సాగర్​ అని కూడా పిలుస్తారు. 
  • గోదావరి జలాల్లో తెలంగాణకు 337 టీఎంసీలు కేటాయించారు. 
  • గోదావరి నదీ జలాల పంపిణీ కోసం బచావత్​ ట్రిబ్యునల్​ను ఏర్పాటు చేశారు. 
  • గోదావరి జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు 1480 టీఎంసీలు కేటాయించారు. 
  • జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు.
  • గోదావరి జల వివాద ట్రిబ్యునల్​ను కేంద్రం 1969, ఏప్రిల్​ 10న ఏర్పాటు చేసింది.
  • నిజాం కాలంలో 330 టీఎంసీల సామర్థ్యంతో పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియను అప్పటి నిజాం ప్రారంభమైంది. 
  • బచావత్​ ట్రిబ్యునల్​ అవార్డులో నదీ పరీవాహక ప్రాంతం, భాగస్వామ్య రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాలు, ప్రాంతాల వెనుకబాటుతనం ఆధారంగా నీటి కేటాయింపులు జరిగాయి. 
  • 58 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగిన నిజాంసాగర్​ ప్రాజెక్టును 1931లో నిజాం ప్రభుత్వం నిర్మాణాన్ని పూర్తి చేసింది.
  • నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఇసుక మేటలురాకుండా నిరోధించడానికి, పైభాగంలో 38 టీఎంసీల సామర్థ్యంతో దేవనూర్​ ప్రాజెక్టు నిర్మించారు. 
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో మొత్తం గోదావరి పరీవాహక ప్రాంతంలో 79 శాతం తెలంగాణ ప్రాంతంలో ఉంది.