ఆర్మూర్​ ఆర్టీసీ బస్టాండ్​లో బేబీ ఫీడింగ్​ క్యాబిన్​ ఏర్పాటు

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ లో శిశువులకు పాలిచ్చే తల్లుల కోసం బీబీ ఫీడింగ్​ క్యాబిన్ ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాబిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం సరస్వతి ప్రారంభించారు.  

కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం రవికుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్, శ్రీకాంత్, నారాయణ గౌడ్, డీకే రాజేశ్, చేపూర్ గణేశ్, సుధీర్ బాబు, రఫీక్ గోహార్, జీవీ నర్సింహారెడ్డి,  విజయానంద్, వెంకట్రామిరెడ్డి, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.