సింగరేణి ఉద్యోగులకు సెకండ్​ పెన్షన్​ స్కీమ్​ అమలు చేయాలి : బి.జనక్​ ప్రసాద్​

గోదావరిఖని, వెలుగు : కోల్​ ఇండియాలో అమలు చేస్తున్నట్టుగా సింగరేణిలో ఉద్యోగులకు సెకండ్​ పెన్షన్​ స్కీమ్​ను అమలు చేయాలని ఐఎన్​టీయూసీ సెక్రెటరీ జనరల్​ బి.జనక్​ ప్రసాద్​ కోరారు. సోమవారం హైదరాబాద్​ సింగరేణి భవన్​లో సంస్థ సీఎండీ ఎన్​.బలరామ్​, డైరెక్టర్​ ఎన్​వికె శ్రీనివాస్​ను కలిసి మెమోరాండం అందజేశారు.

 సింగరేణి ఉద్యోగులకు సెకండ్​ పెన్షన్​ స్కీమ్​ అమలు చేయడం వల్ల వారు రిటైర్డ్​ అయితే సుమారుగా రూ.20 లక్షల వరకు  ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయమై యూనియన్​ పక్షాన కోల్​ ఇండియా ఆఫీసర్లతో కూడా చర్చిస్తామని తెలిపారు. అలాగే ఎన్నికల కోడ్​ వల్ల పెండింగ్​లో ఉన్న పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా కొత్త గనులు ప్రారంభించాలని, సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్​ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరారు.