Kazakhstan Plane Crash: కజకిస్తాన్ లో కూలిన విమానం..28 మంది బతికి బయటపడ్డారు

కజకిస్తాన్ లో ప్యాసింజర్ విమానం కూలిన విషయం తెలిసింది.. ప్రమాదం సమయంలో విమానంలో 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు.. ఈ ప్రమాదంలో 28 మంది ప్రాణాలతో బయటపడినట్టు స్థానిక అధికారులు తెలిపారు. 

బుధవారం ( డిసెంబర్ 25) ఉదయం అజర్ బైజాన్ నుంచి రష్యాకు వెళ్తున్న విమానం.. కజకిస్తాన్ లోని అక్తావు నగర సమీపంలో కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఈ విమానం సాంకేతికలోపంతో కూలిపోయి నేలపై పడిపోయింది.. దీంతో విమానం ముక్కలు ముక్కలైంది..రక్తసిక్తమైన ప్రయాణికులు  దేహాలు విమానం నుంచి జారి పోతు కనిపించాయి. విమానం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

ALSO READ | 250 కిలోమీటర్ల వేగంతో కిందకు దిగుతూ.. పేలిపోయిన విమానం.. ప్రమాద సమయంలో 67 మంది ప్రయాణికులు..

అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. ఇద్దరు పిల్లలతో సహా ప్రాణాలతో బయటిపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని కజకిస్తాన్ అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతదేహాలను వెలికి తీస్తున్నారు. 

అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన J2 8243 ఫ్లైట్ , ఎంబ్రేయర్ 190 జెట్; బాకు నుంచి రస్యాలోని చెచ్న్యా కి వెళుతోంది. అయితే కజకిస్తాన్ లోని అక్టౌ సమీపంలో రాగానే సాంకేతిక లోపంతో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ల్యాండింగ్ సమయంలో విమానం భూమిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు.