Devotional : నాలుగు రూపాల్లో దర్శనం ఇచ్చే అయ్యప్పసామి.. మన తెలంగాణలో..

దేశంలో ఎక్కడాలేని విధంగా నాలుగు రూపాల్లో దర్శనమిస్తున్నాడు ఈ అయ్యప్ప. ఈ ఆలయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉంది. అయ్యప్ప భక్తులు సింగరేణి యాజమాన్యం సహకారంతో 2011లో ఈ ఆలయాన్ని నిర్మించారు. కులుత్తుపులై, అచ్చన్ కోవిల్, అర్యాంగవయ్యా, హరిహర పుత్రుడుగా అయ్యప్పస్వామి నాలుగు అవతారాల్లో అవతరించాడని భక్తుల నమ్మకం. అందుకే నాలుగు రూపాల్లో అయ్యప్ప దర్శనమిచ్చేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు. శైవం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యంలో ఉన్నవాళ్లకు ఒక్కొక్క రూపంలో కనిపి స్తాడని భక్తుల నమ్మకం. “మనదేశంలో ఎక్కడా ఇలాంటి ఆలయం లేదు. 

గర్భగుడి వెనుక గణపతి, సుబ్రమణ్యేశ్వర స్వామి, మాలికాపురత్తమదేవి, నాగరాజుల విగ్ర హాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మండపం, ముందు భాగంలో ధ్వజస్తంభం, లక్ష్మీనారాయణలకు ప్రతీక లైన వేప, రావి చెట్లు ఉన్నాయి. ఇరవై ఒక్క రోజులపాటు వాటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే కోరిన కోరికలు తీర్చే ఆలయంగా పేరుందని” చెప్పాడు ఆలయ పూజారి కొదురుపాక క్రిష్ణమాచార్యులు.