నేత్రపర్వంగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవం

లింగంపేట, వెలుగు : లింగంపేట మండల కేంద్రంలో శుక్రవారం అయ్యప్పస్వామి ఆరట్టు ఉత్సవం ఘనంగా జరిగింది. అయ్యప్ప స్వాములు స్వామివారి  విగ్రహకి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అయ్యప్ప దేవాలయం వద్ద గల ఏకశిల 18 మెట్ల మీదుగా స్వామివారి ఊరేగింపు ప్రారంభించా రు.

ఊరేగింపు ప్రధాన వీధులగుండా సాగింది.  అయ్యప్పల శరణు ఘోష ఆధ్యాత్మిక వాతావరణం నెలకంంది. కార్యక్రమంలో గురుస్వాములు రవిగౌడ్, చంద్రమౌళి, శ్రీకాంత్​అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.