అయోధ్య వెళ్లాలనుకునేవారు తప్పకుండా కొన్ని పర్యాటక ప్రదేశాలను సందర్శించాలి. ఈ పర్యాటక ప్రదేశాలన్నీ అయోధ్య పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల లోపే ఉంటాయి. అంతేకాకుండా ఈ నగరం చుట్టుపక్కల కొన్ని పురాతనమైన దేవాలయాలు కూడా ఉన్నాయి.
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేళ.. అయోధ్య నగరం కొత్తరూపు సంతరించుకుంటోంది. నగరమంతటా ఆధ్యాత్మిక భావన వెల్లివిరిసేలా ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోపక్క, అయోధ్య రామాలయంలో (Ayodhya Ram Mandir) విగ్రహ ప్రతిష్ఠాపన పనులు తుది దశకు చేరుకున్నాయి. రామాలయ ప్రారంభోత్సవానికి ఇంకా రోజుల సమయం మాత్రమే ఉండడంతో అయోధ్యలో ఎక్కడ చూసినా పనుల సందడే కనిపిస్తోంది. రామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన దేవాలయంతో పాటు ఏఏ ప్రాంతాలు పర్యాటక శోభను సంతరించుకున్నాయో తెలుసుకుందాం. . . .
ఇప్పుడు భారతదేశంలో చూడాల్సిన పర్యాటక ప్రదేశాల్లో అయోధ్య కూడా ఒకటి. ఉత్తరప్రదేశ్‌లోగని అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠి వేడుకలు ప్రారంభమయ్యాయి. జనవరి 22వ తేదీన రాంలాలాను ఆలయంలో ప్రతిష్ఠిస్తారు. ఈ సందర్భంగా ప్రముఖులు, టూరిస్టులతో అయోధ్య పట్టణమంతా పండగ వాతావరణం నెలకొంది. అలాగే ప్రపంచ నలుమూలల నుంచి అయోధ్యలోని రామ మందిరాన్ని చూసేందుకు తరలివస్తున్నారు. మీరు కూడా అయోధ్య వెళ్తున్నారా? అయితే అయోధ్య వెళ్లాలనుకునేవారు అయోధ్య రామ మందిరాన్ని సందర్శించడమే కాకుండా మేము తెలిపిన టాప్ మోస్ట్ టూరిజం ప్లేస్ లకు వెళ్లి ఆనందించండి.
అయోధ్య పరిసర ప్రాంతాల్లో చూడవలసిన ప్రదేశాలు...
అయోధ్యలో ముఖ్యమైన ప్రదేశాలు చూడాలంటే రిక్షాలు మాట్లాడుకుని వాటిలో వెళ్ళి చూడాలి. రిక్షా నడిపేవారు ఇక్కడ ముఖ్యమైన ఆలయాలు, మందిరాలను ఒక్కొక్కటిగా చూపుతారు. రామజన్మభూమిని కూడా అలాగే చూడాలి.
సరయూనది స్నానఘట్టం: ఇక్కడ సరయూ నదిలో తీరంలో బంకమట్టి అధికంగా ఉంటుంది. సరయూ నదీజలాలు తేటగానూ శుభ్రంగానూ ఉంటాయి.
గుప్తర్ ఘాట్: అయోధ్యలోని చూడాల్సిన పర్యాటక ప్రదేశాల్లోని గుప్తర్ ఘాట్ ఒకటి. ఇది అయోధ్యలోని ఫైజాబాద్‌లో సరయూ నది ఒడ్డున ఉన్న ఎంతో పవిత్రమైన స్థలం. అయోధ్యలోని ధార్మిక ప్రదేశాలలో ఒకటైన గుప్తర్ ఘాట్ భక్తులతో ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది. అంతేకాకుండా శ్రీరాముడు ఈ ఘాట్ నుంచే తిరిగి వైకుంఠానికి వెళ్ళాడని అక్కడి ప్రజల నమ్మకం.
రామ జన్మభూమి: అయోధ్య పట్టణానికి పేరు రావడానికి ప్రధాన కారణం ఆ నగరంలో శ్రీరాముడు జన్మించడం.. అందుకే అయోధ్య పట్టణాన్ని భారతీయులు రామ జన్మభూమిగా పిలుస్తారు. ఇంతకుముందు ఈ స్థలంలో బాబ్రీ మసీదు ఉండేది. దీనిని 1992లో కొంతమంది హిందూ జాతీయవాదులు కూల్చివేశారు. చాలా ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు ఈ బాబ్రీ మసీదు పై తీర్పు వెల్లడించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం బాబ్రీ మసీదు ప్రాంతంలోని రామ మందిరాన్ని నిర్మించింది. ఈ రామ మందిరానికి సంబంధించిన పనులు పూర్తి కావడంతో ఈ నెల 22వ తేదీన శ్రీరాముడు ఆలయంలో కొలువు తీరానున్నారు. భక్తులకు శ్రీరాముని దర్శన ప్రక్రియను రామ జన్మభూమి ట్రస్ట్ జనవరి 22 ఉదయం 8 గంటల నుంచి ప్రారంభించబోతోంది.రామజన్మభూమి ఆలయనిర్మాణ ప్రదేశం. ఇక్కడ రామజన్మభూమిలో వివాదం ముగిసాక ఆలయనిర్మాణం కొరకు అవసరమైన శిల్పాలు మొదలైనవి నిర్మించి సిద్ధంగా ఉంచబడ్డాయి.
బాబర్ మసీదు నిర్మించిన ప్రదేశంలో రామజన్మ భూమిలో తాత్కాలికంగా అతి చిన్నదైన రామాలయంలో సీతారాములకు పూజాధికాలు నిర్వహించబడుతున్నాయి. అత్యంత రక్షణ వలయంలో క్యూపద్ధతిలో ప్రయాణించి ఊ ఆలయాన్ని చూడాలి. లోపలకు ప్రవేశించడానికి కఠినమైన నియమాలు ఉన్నాయి. అలాపోతూ పోతూనే ఆలయాన్ని దర్శించాలి. ఎక్కడా నిలవడానికి రక్షణసిబ్బంద్జి అనుమతించదు. సెల్ పోన్, కెమెరాలు, పెన్నుల వంటివి కూడా లోపలకు అనుమతించరు. లోపల కనీసం రెండు మూడు కిలోమీటర్లు నడవాలి కనుక చెప్పులు వేసుకుని లోపలకు వెళ్లాలి.
నాగేశ్వరనాథ్ ఆలయం: భారతదేశంలో ఎంతో ప్రసిద్ధమైన ఆలయాల్లో నాగేశ్వరనాథ్ ఆలయం ఒకటి. ఇది అయోధ్య జంక్షన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని తేరి బజార్ సమీపంలో ఉంటుంది. ఈ ఆలయంలో మహాశివుడు కొలువుదీరి ఉన్నాడు. కొన్ని శతాబ్దాలకు ముందే ఈ దేవాలయంలో శివలింగాన్ని ప్రతిష్టించారు. స్థానికుల కథనం ప్రకారం.. ఈ శివలింగాన్ని సాక్షాత్తు శ్రీరాముడి చిన్న కుమారుడు పురుషుడు స్థాపించాడట. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు తెరుచుకొని ఉంటుంది.
అయోధ్యలో భిక్షువులు ఉండకూడదన్న ఉద్దేశంతో సాధువులకు ఏర్పాటు చేసిన అన్నదాన సత్రం. ఇక్కడ దాతలసహాయంతో నిధి వసూలు చేసి ప్రతిరోజు సాధువులకు అన్నదానం చేస్తుంటారు. అలాగే ఇక్కడ ఉన్న గోశాలలో 200 కు పైగా గోవులు ఉన్నాయి. ఈ గోక్షీరం ఆశ్రమనిర్వహణకు ఉపయోగించబడతాయి.
కౌసల్యాదేవి మందిరం: శ్రీరామునికి జన్మనిచ్చిన కౌశల్యాదేవికి ఇక్కడ మాత్రమే మందిరం నిర్మించబడి ఉంది. ఈ మందిరంలో కౌశల్యాదేవి, దశరథులతో రామచంద్రుడు ఉండడం విశేషం.
హనుమద్ మందిరం:ఇక్కడ ఉన్న హనుమదాలయంలో నిరంతరం అఖండ భజన కొనసాగుతూ ఉంటుంది.
గులాబీ తోట: గులాబి బారి అనేది అయోధ్యలోని ఫైజాబాద్‌లోని వైదేహి నగర్ ప్రాంతంలో ఉన్న ఒక సమాధి.. ఇది ఉత్తరప్రదేశ్లో ఎంతో ఫేమస్ అయిన పర్యాటక ప్రదేశం.. ఇక్కడ ఎన్నో రంగుల గులాబీ పూల చెట్లతో పాటు.. ఎటు చూసినా కళ్ళకు పచ్చదనమే కనిపిస్తుంది. ఈ గులాబీ బారి అవధ్ 3వ నవాబు షుజా-ఉద్-దౌలాచే స్థాపించారని సమాచారం. ఈ పర్యాటక ప్రదేశం ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరుచుకొని ఉంటుంది.
వాల్మికీ మందిరం. వాల్మికీ మందిరంలోని పాలరాతి గోడల మీద వాల్మికీ రామాయణంలోని 24 వేల శ్లోకాలు లిఖించబడి ఉన్నాయి. ఇక్కడ మూల మందిరంలో వాల్మికి మహర్షితో లవకుశులు ఉండడం విశేషం.
కనక మహల్:సీతారాములు వివాహానంతరం అయోధ్యలో ప్రవేశించిన తరువాత కైకేయీ, దశరథులు వివాహ కానుకగా సీతారాములకు ఈ భవనం ఇవ్వబడిందని విశ్వసించబడింది. ప్రస్తుతభవనం విక్రమాదిత్యుడు నిర్మించాడని విశ్వసించబడుతుంది. విక్రమాదిత్యుడు సరయూ నదిలో స్నానం ఆచరించి అయోధ్యా నగరంలో ప్రవేశించిన తరువాత ఆయనకు ఇక్కడ గతంలో ఉన్న భవనాలు కళ్లకు కట్టినట్లు గోచరమైయ్యాయని తరువాత విక్రమాదిత్యుడు ఇక్కడ ఆలయాలు, భవనాలు నిర్మించబడ్డాయని విశ్వసించబడుతుంది.
హనుమదాలయం:
రామచంద్ర పట్టాభిషేకం తరువాత రామచంద్రుడు తనకు సాయం చేసిన వారందరికి కానుకలు సార్పించిన తరువాత తనకు అత్యధికంగా సహకరించి సేవించిన హనుమంతునికి తన నివాసానికంటే ఎత్తైన ప్రదేశంలో నివాసానికి యోగ్యమైన స్థలం ఇచ్చాడని అక్కడ ప్రస్తుతం ఆలయనిర్మాణం జరిగిందని విశ్వసించబడుతుంది. పురాణ ప్రసిద్ఫ్హమైన ఈ ఆలయం కొంచం ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఈ ఆలయానికి సుమారు 90 మెట్లుంటాయి. ఆలయ ప్రాంగణంలో సితారాముల ఆలయం ఉంది.